Templates by BIGtheme NET
Home >> Cinema News >> స్టార్ కపుల్ ముద్దును తిరష్కరించిన ఇన్ స్టాగ్రామ్

స్టార్ కపుల్ ముద్దును తిరష్కరించిన ఇన్ స్టాగ్రామ్


టీం ఇండియా స్టార్ క్రికెటర్ హార్ధిక్ పాండ్యా కాబోయే భార్య నటాసా ఇటీవలే బాబుకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. వీరిద్దరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తమ లవ్లీ మూమెంట్స్ ను మరియు క్యూట్ మూమెంట్స్ ను వీరిద్దరు ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవలే పాండ్యా తన కొడుకు ఫొటోలను షేర్ చేసిన విషయం తెల్సిందే. అలాగే నటాషా కూడా తమ ఇద్దరి ఫొటోలను షేర్ చేయడం.. స్టోరీగా పెట్టడం చేస్తుంది. అయితే తాజాగా నటాషా పెట్టిన ఒక ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ డిలీట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. ఆ ఫొటో బూతుగా లేకపోవడంతో పాటు చాలా లవ్లీగా ఉంది. మరి ఆ ఫొటోను ఎందుకు డిలీట్ చేశారో అర్థం కాలేదు.

నటాషా పెట్టిన ఆ ఫొటోలో పాండ్యా ఆమెను మద్దు పెడుతున్నట్లుగా ఉంది. అది కూడా బుగ్గ మీద ముద్దు పెడుతున్నట్లుగా ఉంది. ఆ సింపుల్ ఫొటోను ఇన్ స్టా గ్రామ్ డిలీట్ చేసింది. లీప్ లాక్ ఫొటోలు హాట్ ఫొటోలతో రాని ఇబ్బంది ఈ ఫొటోతో ఏం వచ్చిందో అర్థం కాలేదు. ఫొటోను డిలీట్ చేసిన ఇన్ స్టాగ్రామ్ మీరు పెట్టిన ఈ ఫొటో మా కమ్యూనిటీ గైడ్ లైన్స్ కు విరుద్దంగా ఉంది అంటూ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అదే ఫొటోను మరియు ఇన్ స్టా మెసేజ్ ను ఆమె మళ్లీ షేర్ చేసింది. దాంతో ఇన్ స్టాగ్రామ్ పై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.