పవన్ సినిమాకు ఆ పేరు కంటే ఇది అదిరిపోయేలా ఉందే!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబినేషన్ లో ఏఎం రత్నం నిర్మాతగా ఓ పీరియాడిక్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అభిమానుల్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదల అయింది. దీనికి భారీ రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు ఏ రేంజిలో కోరుకుంటున్నారో అందుకు తగ్గట్టే క్రిష్ పోస్టర్ విడుదల చేశాడు. అయితే ఈ సినిమాకు ఇంకా టైటిల్ కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పటికే మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అందులో విరూపాక్ష అనే టైటిల్ అందరికీ నచ్చింది.

అయితే ఈ సినిమాకి ఇప్పుడు మరో టైటిల్ అనుకుంటున్నారు. అదే ‘ఓం శివమ్ ‘. ఇది వినగానే అభిమానుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. అభిమానులంతా విరూపాక్ష పేరు కంటే ఇదే బాగుందని అంటున్నారు. ఓం శివమ్ తో పాటు మరిన్ని పేర్లను క్రిష్ పరిశీలిస్తున్నాడు. ఫైనల్ గా ఏది కన్ఫర్మ్ చేస్తారో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. అయితే క్రిష్ మాత్రం ఖాళీగా ఉండకుండా సాయి ధరంతేజ్ తో ఓ సినిమాను మొదలు పెట్టాడు.ఆ సినిమా షూటింగ్ చేస్తూనే పవన్ సినిమాకు అవసరమైన సెట్లు ఇతర పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. కరోనా కాస్త తగ్గితే పవన్ వకీల్ సాబ్ ను ఫినిష్ చేసి ఆ తర్వాత క్రిష్ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నారు.