పవన్ 27వ సినిమాకి ఆసక్తికరమైన టైటిల్స్.. అవేంటంటే..??

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ లో బిజీ ఉండగానే తన తదుపరి చిత్రం పనులను శరవేగంగా మొదలుపెట్టాడు డైరెక్టర్ క్రిష్. పవన్ కళ్యాణ్ 26వ చిత్రం వకీల్ సాబ్ హిందీ నుండి రీమేక్ చేస్తుండగా ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజకీయాల తర్వాత పవర్ స్టార్ రీఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా కాబట్టి ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి.అలాంటిది తదుపరి చిత్రం గురించి చిన్న వార్త తెలిసినా అభిమానులకు పండగే. పవర్ స్టార్ నటించనున్న 27వ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేయనున్నాడు.

ఈ సినిమాను ఏయం. రత్నం నిర్మిస్తుండగా.. ఈ సినిమా మొఘలుల సామ్రాజ్యంలోని ఒక బందిపోటు కథతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. చారిత్రాత్మక చిత్రం కావడంతో భారీ సెట్లను ఆ కాలం నాటి నేటివిటీని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు చిత్రవర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లోనే గొప్ప చిత్రంగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ నటించనున్న తొలి హిస్టారికల్ చిత్రం కాబట్టి చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సొంతం చేసుకుంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

మరి డైరెక్టర్ క్రిష్ చాలా కాలం గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్ సినిమాపై పనిచేస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ గురించి తాజాగా ఫిలింనగర్ చుట్టూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో బందిపోటు.. గజదొంగ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు టాక్. మరి నామమాత్రంగా విరూపాక్ష అని పిలుచుకుంటున్న ఈ సినిమా టైటిల్ ఏది ఫిక్స్ చేస్తారో అని కాస్త ఆసక్తి నెలకొంది. డైరెక్టర్ రాజమౌళిలా సంవత్సరాల పాటు కాకుండా క్రిష్ కొన్ని నెలలోనే షూటింగ్ పూర్తీ చేస్తాడని ఫ్యాన్స్ అంటున్నారు. చూడాలి మరి ఈ పవర్ స్టార్ పీరియాడిక్ బందిపోటు ఫిల్మ్ తెరమీదకి ఎప్పుడు రానుందో..!!