‘నవరస’ గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్

0

దర్శక దిగ్గజం మణిరత్నం దర్శకత్వంలో ఒక భారీ వెబ్ సరీస్ రాబోతున్న విషయం తెల్సిందే. నవరసాలకు సంబంధించి 9 ఎపిసోడ్స్ గా వెబ్ సిరీస్ ను రూపొందించబోతున్నారు. 9 ఎపిసోడ్స్ కు 9 మంది దర్శకులు పని చేయబోతున్నారు. నటీ నటులు కూడా వేరు వేరుగా ఉంటారు. ఒక్కో ఎపిసోడ్ లో ఒక నట రసంను చూపించబోతున్నారు. కథ ఆ విధంగా ముందుకు సాగుతుంది. ప్రతి ఎపిసోడ్ కూడా దేనికి అదే అన్నట్లుగా అద్బుతంగా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ లోని ఒక ఎపిసోడ్ లో సూర్య నటించేందుకు ఒప్పుకున్నాడు అంటూ గతంలోనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అందుకు సంబంధించి మరో ఆసక్తికర విషయం మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలుస్తోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సూర్య నటించబోతున్న ఆ ఎపిసోడ్ కు మణిరత్నం దర్శకత్వం అంటూ ప్రచారం జరిగింది. కాని అది నిజం కాదని గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందుతుందని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కు పని చేసే ప్రతి ఒక్కరు కూడా ఉచితంగానే పని చేస్తున్నట్లుగా తమిళ సినీ వర్గాల వారి ద్వారా తెలుస్తోంది. నవరస వెబ్ సిరీస్ కోసం మణిరత్నం కొన్ని నెలలుగా చర్చలు జరుపుతున్నారు.

తమిళ స్టార్స్ తో పాటు స్టార్ టెక్నీషియన్స్ ఎంతో మంది ఈ వెబ్ సిరీస్ కోసం పని చేయబోతున్నారు. తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు మరియు మణిరత్నం అభిమానులు ఈ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి వెబ్ సిరీస్ లో స్టార్ హీరో సూర్య కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరగడం ఖాయం అనిపిస్తుంది.