త్రివిక్రమ్ నెక్ట్స్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

0

ఈ ఏడాది ఆరంభంలో అల వైకుంఠపురంలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రివిక్రమ్ సమ్మర్ లో ఎన్టీఆర్ తో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. అయితే కరోనా కారణంగా ప్లాన్ అంతా రివర్స్ అయ్యింది. ఏడు ఎనిమిది నెలలు పూర్తిగా షూటింగ్స్ నిలిచి పోవడంతో ఎన్టీఆర్ వెంటనే త్రివిక్రమ్ కు డేట్లు ఇవ్వలేని పరిస్థితి. ఎన్టీఆర్ తో సినిమా చేయాలంటే చాలా టైం వెయిట్ చేయాల్సి ఉంది. అందుకే ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మరో సినిమా చేస్తాడంటూ చాలా బలంగా ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ కు స్రవంతి రవికిషోర్ కు మద్య సంబంధాలు ఉన్నాయి. ఆ సన్నిహిత్యం కారణంగానే రామ్ తో ఒక సినిమాను స్రవంతి వారి కోసం చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు.

రామ్ కు చాలా కాలంగా త్రివిక్రమ్ తో ఒక మాస్ క్లాస్ ఎంటర్ టైనర్ చేయాలని కోరికగా ఉందట. జులాయి లో అల్లు అర్జున్ పోషించిన పాత్ర తరహాలో రామ్ చేయాలని కోరుకుంటున్నాడట. అలాంటి కథను త్రివిక్రమ్ కూడా రెడీ చేశాడంటూ వార్తలు వస్తున్నాయి. జులాయి కథకు సీక్వెల్ అన్నట్లుగా కూడా కథ ఉండే అవకాశం ఉందని మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్ తో భారీ బడ్జెట్ తో త్రివిక్రమ్ సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఎప్పటిలాగే ఈ సినిమాను హాసిని హారిక క్రియేషన్స్ లో రాధాకృష్ణ నిర్మించబోతున్నాడు.

ఇక రామ్ హో బ్యానర్ స్రవంతి రవికిషోర్ వారు కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే జనవరిలోనే ఈ సినిమా పట్టాలెక్కి ఆరు నెలల్లో పూర్తి అయ్యి విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ కాంబో గురించి ఇన్ని వార్తలు అయితే వస్తున్నాయి కాని ఇప్పటి వరకు కనీసం అధికారికంగా ఒక్క ప్రకటన కూడా రాలేదు. అలా అని ఈ వార్తలు పుకార్లే అంటూ ఖండన కూడా రాలేదు. కనుక రామ్ అభిమానులు ఆశతో త్రివిక్రమ్ మరియు హాసిని హారిక వారి వైపు చూస్తున్నారు. ఏ క్షణంలో అయినా అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.