Templates by BIGtheme NET
Home >> Cinema News >> RGV మిస్సింగ్ కి ఇంటర్నేషనల్ జోకర్ లింకు?

RGV మిస్సింగ్ కి ఇంటర్నేషనల్ జోకర్ లింకు?


`ఆర్జీవీ మిస్సింగ్` ప్రచారార్భాటం తెలిసినదే. ఇప్పటికే ఐదు లుక్ లు రిలీజ్ చేసేశాడు ఆర్జీవీ. ఇలా మొదలెట్టడం ఆలస్యం.. ఇంత స్పీడ్ గా ప్రమోషన్ ఎలా చేయాలో ఆయనకు మాత్రమే తెలిసిన సీక్రెట్ అనే అనుకోవాలి. `ఆర్జీవీ మిస్సింగ్` .. పీకే ఫ్యాన్స్ .. మెగా ఫ్యామిలీ.. మాజీ సీఎం ఆయన కొడుకు వల్లనే ..! అంటూ ఆసక్తికర క్యాప్షన్ తో ఇప్పటికే జనంలోకి వెళ్లిపోయాడు.

ఈ సిరీస్ లో ఇంతకుముందు ఆఫీసర్ గజనీకాంత్ పోస్టర్ ని రివీల్ చేయగా లుక్ వైరల్ అయ్యింది. గజినీకాంత్ పాత్రధారి పోలీస్ అధికారిగా సీరియస్ ఎక్స్ ప్రెషన్ లో ఫన్ జనరేట్ చేయడం బావుంది. ఆరో లుక్ తాజాగా రివీలైంది. ఈసారి ఏకంగా ఆర్జీవీ మిస్సింగ్ లో ఇంటర్నేషనల్ జోకర్ నటించేస్తున్నారట. ఆయన లుక్ ని రిలీజ్ చేశాడు. అయితే జోకర్ అనగానే హాలీవుడ్ బ్లాక్ బస్టర్ `జోకర్` మూవీ గుర్తుకు వస్తుంది. అందుకు రిజంబ్లెన్స్ ఏదీ ఈ పోస్టర్ లో కనిపించడం లేదు మరి. అయినా RGV మిస్సింగ్ కి ఇంటర్నేషనల్ జోకర్ లింకేమిటో అస్సలు అర్థం కాదు. ఏదో ఒకటి చేసి మొత్తానికి ప్రచారం అయితే కొట్టేస్తున్నాడు.

అన్నట్టు ఆర్జీవీ మిస్సయితే ఎవరికి నష్టం? ఎవరికి కష్టం? అన్నది మాత్రం ఆయన చెప్పడమే లేదు. పోస్టర్లు ఫన్నీగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ పోస్టర్ల ప్రచారం ఆపేస్తే.. ఏదైనా టీజర్ లాంటిది వస్తుందా? అన్నది ఆయన చెబుతారని అంతా ఆసక్తిగా ఉన్నారు. లఘు చిత్రమే అయినా.. ఈ ఫన్నీ కామెడీ ఎంటర్ టైనర్ ఏమాత్రం వర్కవుటవుతుందో చూడాలంటూ ఫిలింగనగర్ వాసులు వెయిటింగ్. కె వి ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.