స్టార్ కిడ్ లవ్వు.. ఫెవికాల్ హగ్గు!

0

బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కు ఓ ముద్దుల కూతురు ఉంది. పేరు ఇరా ఖాన్. ఈమధ్య కాస్త హాటు ఫోటోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఆరంభించిన ఈ స్టార్ కిడ్ నెటిజన్లకు సుపరిచితురాలే. నాభి రింగులతో.. ఘాటు టాట్టూలతో తన బోల్డ్ నేచర్ గురించి ఎప్పుడో హింట్ ఇచ్చేసింది. ఇక కొన్ని నెలల క్రితం ఒక ఇన్స్టా ఫాలోయర్ ఇరాను “మీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా.. ఎవరితో డేటింగ్ చేస్తున్నారు?” అని ప్రశ్నించాడు. ఇరా తడుముకోకుండా ‘మిశాల్ కృపలాని’ అంటూ పేరు చెప్పేసి అందరికీ షాక్ ఇచ్చింది. అంతటితో ఊరుకోకుండా ఆ యంగ్ మ్యాన్ తో చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోను షేర్ చేసింది.

తాజాగా మరోసారి ఈ ఇరవై రెండేళ్ళ భామ తన బాయ్ ఫ్రెండ్ తో క్లోజ్ గా ఉన్న ఒక ఫోటోను ఇన్స్టా లో ఎత్తి పడేసింది. ఇంకేముంది? ఆ ఫోటో వైరల్ అయింది. ఈ ఫోటోలో మిశాల్ ఇరాను వెనకనుండి చేతులతో కౌగిలిలో బంధించాడు. ఇరా ఆ ప్రేమ హగ్గును ఆస్వాదిస్తూ నవ్వుతోంది. ఈ ఫోటోకు ఇరా ఇచ్చిన క్యాప్షన్ “ఎవిరిథింగ్ విల్ బీ ఓకే”. అంటే అంతా సవ్యంగా ఉంటుందని ఇరా ఉద్దేశం కావచ్చు. ఈ క్యాప్షన్ కు తోడుగా #లవ్.. #మిస్సింగ్ యు.. #రిలేషన్ షిప్ అంటూ ఓ పది హ్యాష్ టాగ్ లను తగిలించింది.. ఈ వ్యవహారం చూస్తుంటే ప్రేమ ముదిరి పాకాన పడినట్టే ఉంది.

ఈ ఫోటోకు నెటిజన్ల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. “ఇంటెన్స్ లవ్ స్టొరీలా ఉందే”.. “నువ్వు టెన్షన్ పడకు.. మేము ఆమిర్ భాయ్ తో మాట్లాడి ఒప్పిస్తాం లే”.. “ఖాన్ సాబ్ పేరు చెడగొడుతున్నావు”.. “సూపర్ జోడి” అంటూ ఎవరికి తోచిన కామెంట్లు పెట్టారు.
Please Read Disclaimer