ఐరెన్ లెగ్ హీరోయిన్ గ్రేట్ కం బ్యాక్

0

వరుస ఫ్లాప్ లు ఎదురైతే `ఐరన్ లెగ్` అనే ప్రాపగండా ఎదుర్కోవాలి. తొలి సినిమా నుంచి చేసిన ప్రతి సినిమా ఫ్లాపవుతుంటే ఏం ఐరన్ లెగ్గురా బాబూ! అని మోసేస్తుంది సినీ సమాజం. అచ్చు ఇలాంటి పరిస్థితినే గత కొన్నేళ్లు గా అనుభవిస్తోంది కృతి కర్బందా. సుమంత్ నటించిన `బోణీ` చిత్రం తో తెలుగు ప్రేక్షకుల కు పరిచయమైన కృతి తొలి ప్రయత్నం ఫెయల్. నాటి నుంచి పదే పదే ఫ్లాప్ లను సొంతం చేసుకుంది. తుది కంటా ఆమె పరాజయాల పరంపర కొనసాగింది. దీంతో ఐరెన్ లెగ్ ముద్ర వేసి టాలీవుడ్ పక్కన పెట్టేసింది.

పవన్ కల్యాణ్ తో తీన్మార్.. మంచు మనోజ్తో `మిస్టర్ నూకయ్య` చివరికి రామ్ చరణ్ కు సోదరిగా మారి చేసిన `బ్రూస్ లీ` కృతి కి చేదు అనుభవాలనే మిగిల్చాయి. దీంతో తెలుగు లో లాభం లేదని భావించిన కృతి తమిళ-కన్నడ- హిందీ భాషల్లో ప్రయత్నించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరికి డీగ్రేడ్ సినిమాల్లో చేసినా అవీ ఆకట్టుకో లేకపోయాయి. అయినా లేడీ గజినీ లా ఇరుగు పొరుగు పరిశ్రమల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అందివచ్చిన అవకాశాన్ని అంది పుచ్చుకుని ఇప్పటికి హిట్లు కొడుతోంది.

ఇక కృతి కెరీర్ అయి పోయింది అనుకున్న వేళ `హౌస్ఫుల్ 4` చిత్రంతో భారీ విజయాన్ని అందుకోవడం కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా విమర్శకుల చీవాట్లు ఎదుర్కొన్నా.. బాక్సాఫీస్ విజయం సాధించడం హుషారు పెంచింది. దీంతో రెట్టించిన ఉత్సాహం తో వున్న కృతి బాలీవుడ్ లో మరిన్ని చిత్రాల్ని అంగీకరించిందట. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం `పాగల్ పంతి` పూర్తి ఎంటర్టైన్మెంట్ నేపథ్యం లో రూపొందుతోంది. ఇది కూడా గత మల్టీస్టారర్ తరహా లోనే హిట్ అయితే కృతి కెరీర్ ఊపందుకోవడం ఖాయం. ఈ జోరు గురించి తెలిసిన వాళ్లంతా కృతి 2.0 రీబూట్ అయ్యింది. ఇక టైమ్ స్టార్టయినట్టే అంటున్నారు. కృతి స్పీడ్ చూస్తుంటే పోగొట్టుకున్న చోటే రాబట్టుకునేందుకు తిరిగి టాలీవుడ్ లో అడుగు పెట్టినా ఆశ్చర్య పోనక్కర్లేదని అంటున్నారు.
Please Read Disclaimer