ప్రేమలో సూపర్ స్టార్ తనయ

0

బాలీవుడ్ సూపర్ స్టార్ – మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ కొన్ని రోజుల క్రితం ప్రేమికుల రోజు సందర్బంగా ఇతడే తన వాలంటైన్ అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఆ సమయంలో ఆమె పోస్ట్ వైరల్ అయ్యింది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ విషయం గురించి చర్చ ఆగిపోయింది. తాజాగా మరోసారి ఇరా ఖాన్ తన ప్రేమకు సంబంధించిన లీక్ ఇచ్చింది. మ్యూజీషియన్ మిషాల్ కిర్పాలానీతో ఇరా డేట్ లో ఉంది. ఆ విషయాన్ని తన ఇన్ స్టాలో స్వయంగా పేర్కొంది. డేట్ నైట్ అంటూ మిషాల్ తో డిన్నర్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ప్రస్తుతం వీరిద్దరు కూడా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నారు. అక్కడే శాంటా బార్పరాలో ఎంజాయ్ చేసినట్లుగా ఇరా పేర్కొంది. ఇరాతో ఉన్న ఫొటోలను మిషాల్ కూడా తన సోషల్ మీడియా వాల్స్ పై పోస్ట్ చేశాడు. ఇటీవలే అమీర్ ఖాన్ మాట్లాడుతూ తన కూతురు ఇరా ఖాన్ సినిమాలపై ఆసక్తి చూపుతుందని ఆమె ఆసక్తి మేరకు సినిమాల్లోకి తీసుకు రాబోతున్నట్లుగా పేర్కొన్నాడు. మరి ఇరా మాత్రం ప్రేమలో పడి మునిగి తేలుతోంది.

ప్రేమలో ఉన్న ఇరా సినిమాల్లోకి వచ్చేందుకు మరికాస్త సమయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. నటన మరియు దర్శకత్వంలో శిక్షణ తీసుకుంటున్న ఆమె మూడు నాలుగు ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. మరో వైపు కూతురు ప్రేమ విషయమై మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇంత వరకు స్పందించలేదు. ఈమద్య కాలంలో ప్రేమ అనేది కామన్ అయ్యింది కనుక అమీర్ ఖాన్ కూడా తన కూతురు ప్రేమకు ఒప్పుకుంటాడని అంతా భావిస్తున్నారు.
Please Read Disclaimer