ప్రెగ్నెన్సీ దాచుకునేందుకు ఈ డ్రస్సా?

0

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్ సంఖ్య ఏ రేంజ్ లో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ ఫిల్మ్ స్టార్స్ లో సోషల్ మీడియా యాడ్ పోస్ట్ ల ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న ప్రియాంక చోప్రాకు కొన్ని సమయంలో అంతే ట్రోల్స్ కూడా తప్పవు. ఆమె డ్రస్ విషయంలో పలు సార్లు ట్రోల్స్ ను ఎదుర్కొంది. తాజాగా మరోసారి కూడా ఆమె నెట్టింట ట్రోల్స్ ను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఆమె ఈసారి వేసుకున్న డ్రస్ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది.

ప్రియాంక చోప్రా అంటే అందాల ఆరబోతను ప్రతి ఒక్కరు ఆశిస్తారు. కాని ఈసారి మాత్రం ఆమె కన్నుల నుండి మొదలుకుని కాళ్ల ముని వేళ్ల వరకు కూడా కనిపించకుండానే దాచేసింది. ఫుల్ హ్యాండ్స్ మెడ కూడా కనిపించకుండా డ్రస్ నెక్.. ఇక నడుము వద్ద ఒక బెల్ట్ ఇలా తన అందాల విషయంలో ఎప్పుడు లేని విధంగా కప్పి ఉంచేప్పటికి ఆమె ను అందాల కోసం అభిమానించే వారు ఫాలో అయ్యే వారు ఈ డ్రస్ తో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా బిజీ అయ్యింది. అలాంటి ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అలాంటిది ఈ అమ్మడు ఎందుకు ఇలా కప్పేసుకుంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల జరిగిన బ్రిటన్ రాజకుంటుంబం మరియు టెన్నిస్ లెజెండ్స్ మద్య జరిగిన మ్యాచ్ కు నటాషా తో కలిసి ప్రియాంక చోప్రా హాజరు అయ్యారు. ఆ సమయంలో ధరించిన డ్రస్ విషయంలో అభిమానులను పూర్తిగా నిరుత్సాహ పర్చింది. కొందరు ప్రెగ్నెన్సీని దాచుకునేందుకు ఇలాంటి డ్రస్ వేసుకున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మళ్లీ పీసీ ఇలాంటి డ్రస్ ల్లో కనిపించకూడదని ఆశిస్తున్నాం అంటూ కొందరు అంతర్జాతీయ రేంజ్ అభిమానులు కూడా కామెంట్స్ చేశారు.