ఐశ్వర్యారాయ్ 2 పుడుతోందా?

0

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారా? అంటే అవుననే సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. తాజాగా ఓ బీచ్ సెలబ్రేషన్ లో ఐశ్వర్యారాయ్ బేబి బంప్ ఫోటో ఒకటి యువతరం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. అందులో భర్త అభిషేక్ బచ్చన్ తో కలిసి ఐష్ బీచ్ ఒడ్డున నడుచుకుంటూ వెళుతోంది. ఆ సమయంలో ఆ లూజ్ వస్త్రాల్లో బేబి బంప్ బయటపడడం కనిపిస్తోంది.

2007లో అభిషేక్ ని పెళ్లాడి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ల కోడలు అయ్యింది. అటుపై నాలుగేళ్ల గ్యాప్ అనంతరం.. అంటే 2011లో ఆరాధ్యకు జన్మనిచ్చంది. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వబోతోందని అభిమానులు ముచ్చటించుకుంటున్నారు. ఐష్ బేబి బంప్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర డిబేట్ రన్ అవుతోంది. అది బేబి బంప్ కాదని ఓ అభిమాని ట్వీట్ చేస్తే లేదు ఐష్ రెండో బిడ్డకు జన్మనిస్తుందని ఎదురు చూస్తున్నానని వేరొక వీరాభిమాని రీట్వీట్ చేశాడు. ఓవరాల్ గా ఐష్ బేబి బంప్ హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఇది నిజమా కాదా? అన్నది ఐశ్వర్యారాయ్ కానీ లేదా బచ్చన్ ల ఫ్యామిలీ కానీ అధికారికంగా ధృవీకరించలేదింకా. ప్రస్తుతం అభి- ఐష్ జోడీ సినిమాల్లో నటించేందుకు ప్రణాళికల్లో ఉన్నారు. మరోవైపు ఆరాధ్య తెరంగేట్రంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఫనేఖాన్ (2018) తర్వాత ఐష్ వేరొక సినిమాకి కమిటవ్వలేదు. మునుముందు ఐష్ కమిట్ మెంట్స్ గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయేమో!
Please Read Disclaimer