ఎన్టీఆర్ కి బాలీవుడ్ హీరోయిన్ కి లింకేంటి?

0

టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉందనేది అందరికి తెలిసిందే. ముఖ్యంగా వెటరన్ హీరోలకు కథానాయికలు దొరకడం లేదు. చిరంజీవి- బాలకృష్ణ- నాగార్జున- వెంకటేష్- రాజశేఖర్ వంటి కథానాయకులకు ప్రతి సినిమా విషయంలో హీరోయిన్ల సమస్య వచ్చి పడుతోంది. ఇక తెలుగులో అగ్ర కథానాయికలుగా అనుష్క- నయనతార- తమన్నా- కాజల్- రకుల్- సమంత వంటి వారు మాత్రమే ఉన్నారు. వీరిలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు అగ్ర హీరోలందరితో సెట్ కాని పరిస్థితి ఉంది. సెట్ అయినా అవే ముఖాల్ని అన్ని సార్లు రిపీట్ చేయడం సాధ్యం కాని పని. అందుకే ప్రతి సినిమాకి హీరోయిన్లని వెతుక్కోవడం కత్తిమీద సాములాంటిదనే చెప్పాలి. ఇది కేవలం వెటరన్స్ కే కాదు.. ఇప్పుడు ఇతర స్టార్ హీరోల్ని వేధిస్తోంది. ప్రతిసారీ కొత్త ముఖాల్ని వెతకాలంటే దర్శకనిర్మాతలకు తలకు మించిన భారం అవుతోంది.

ఇదే కన్ఫ్యూజన్ తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎదురైంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’లో నటిస్తున్నారు. ఆయన సరసన హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోర్రిస్ హీరోయిన్ గా నటిస్తోంది. ఒలీవియా కోసం జక్కన్న చాలా కాలం వెయిట్ చేసి వలేసి పట్టాల్సి వచ్చింది. దీంతో పాటు తారక్.. త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘అరవింద సమేత’ తర్వాత అదే కాంబినేషన్ రిపీటవుతోంది. ఈ సమ్మర్ లో సినిమా పట్టాలెక్కనుంది. ఇందులో కథానాయికగా ఎవరిని తీసుకోవాలనే డైలామాలో అటు త్రివిక్రమ్.. ఇటు ఎన్టీఆర్ ఉన్నారట.

మొదట రష్మిక మందన్నా పేరు వినిపించినా.. ఆ తర్వాత తనకు కలిసొచ్చిన హీరోయిన్ పూజా హెగ్డేని ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే వరుసగా పూజాని రిపీట్ చేసే విషయంలో త్రివిక్రమ్ తీసుకుంటున్న చొరవపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే సమయంలో ‘అరవింద సమేత’లో ఎన్టీఆర్ కి జోడిగా పూజా అల్రెడీ నటించింది. ఈ నేపథ్యంలో మరో భామ కోసం వేటలో పడ్డారట. ఈసారి బాలీవుడ్ నుంచి క్రేజీ బ్యూటీనే బరిలో దించాలని భావిస్తున్నారట. ఇటీవల బాలీవుడ్ భామలు తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ సందడి చేస్తున్నారు. కత్రిన- విద్యాబాలన్- శ్రద్ధా కపూర్ ఇప్పటికే తెలుగులో సందడి చేశారు. అలియా భట్ ‘ఆర్ ఆర్ ఆర్’లో నటిస్తోంది. తన చిత్రంలోనూ ఎన్టీఆర్ సరసన కథానాయికగా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియాభట్ ని ఎంపిక చేయాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నారట. అదే సమయం లో మరో హీరోయిన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అతిలోక సుందరి గారాలపట్టి జాన్వీ కపూర్ పేరుని కూడా పరిశీలిస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-