`మేజర్` మూవీలో ఆలియా నిజమా?

0

బాలీవుడ్ అంటే టాలీవుడ్ భామల మోజు ఎలాంటిదో తెలిసిందే. ఉత్తరాదిన వెలగాలని దక్షిణాది భామలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. సీనియర్ నాయికలెందరో బాలీవుడ్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇటీవల ట్రెండు మారింది. `బాహుబలి` తరువాత ఉత్తరాది భామలే దక్షిణాది చిత్రాల్లో నటించాలని ఉబలాటపడుతున్నారు. ఎక్కడ ఛాన్స్ దొరికినా వదులుకోవడం లేదు. ఎంత చిన్న సినిమా అయినా సరే దక్షిణాదికి జై కొట్టేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఆలియా భట్ టాలీవుడ్ లో వరుస ఆఫర్లకు ఓకే చెప్పేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. `బాహుబలి` దర్శకుడు రాజమౌళి `ఆర్.ఆర్.ఆర్`కి ఓకే చెప్పిన ఈ బ్యూటీ మరో తెలుగు సినిమాలో నటించే ఛాన్సుందన్న గుసగుస వినిపిస్తోంది.

ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో ఆలియా కనిపించనుంది. ఈ సినిమాతో పాటు మేజర్ సందీప్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న `మేజర్` కి సంప్రదింపులు చేస్తున్నారట. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని `గూఢచారి` ఫేమ్ శశికిరణ్ తిక్క తెరకెక్కిస్తున్నారు. మహేష్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఇందులో ఓ క్రేజీ పాత్రకు అలియాభట్ ని చిత్రబృందం సంప్రదించిందిట. అసలు ఇందులో ఆలియా పాత్ర ఎలా ఉండనుంది? అది పూర్తి స్థాయి పాత్రనా… లేక కొద్ది నిమిషాలు కనిపించే అతిధి పాత్ర తరహానా? అన్నది చిత్రబృందం రివీల్ చేయాల్సి ఉంది. అన్నట్టు వరుసగా క్రేజీ చిత్రాలతో బిజీగా ఉన్న ఆలియా మరో తెలుగు సినిమాకి అంగీకరించే వీలుందా? అన్నది తనే చెప్పాల్సి ఉంటుంది. ఇక ఆలియా కోసం నమ్రత- మహేష్ బృందం సీరియస్ గానే ట్రై చేస్తున్నారట.
Please Read Disclaimer