ఈ సినిమాతో హీరో కామెడీ చెల్లిపోయినట్లేనా..?

0

ఇండస్ట్రీ లో మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో అల్లరి నరేష్ . తన సినిమాలలో కామెడీ టైమింగ్.. నటనతో మంచి పేరును సంపాదించుకున్నాడు. సీనియర్ల తరం తర్వాత మంచి కామెడీని పంచుతున్న హీరో అల్లరి నరేష్ మాత్రమే. హెల్తీ కామెడీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని పెద్ద హీరోలకు ధీటుగా ఇంతకాలం సినిమాలు చేసాడు. కానీ గత రెండేళ్లు గా తన నుండి హీరో గా అల్లరి నరేష్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. గతేడాది మహర్షి మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసాడు తప్ప హీరోగా రాలేదు. ప్రస్తుతం అల్లరి నరేష్ కామెడీ శైలికి పూర్తి భిన్నంగా వినూత్న కథ కథనాలతో ఓ సినిమా చేస్తున్నాడు. అల్లరి నరేష్ కెరీర్లో 57వ సినిమా గా సామాజిక కథాంశం తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు “నాంది” అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

అల్లరి నరేష్ కెరీర్లో ఇదివరకు నేను గమ్యం శంభో శివ శంభో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందాడు. ఈ సినిమా కూడా ఆద్యంతం ఆసక్తికరంగా సామాజిక అంశాల మేళవింపుతో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. డైరెక్టర్ సతీష్ వేగేశ్న నిర్మాతగా మారి నిర్మిస్తున్న ఈ సినిమాతో విజయ్ కనకమేడల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేయడం అల్లరి నరేష్ కి కొత్తేమి కాదు. మరి ఇక పై కామెడీ చేయకూడదని నిర్ణయించుకున్నాడేమో.. సీరియస్ క్యారెక్టర్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూసి ప్రేక్షకులు అల్లరి నరేష్ కామెడీకి కాలం చెల్లిందని భావిస్తున్నట్లు టాక్. డిజిటల్ మార్కెట్ విస్తరిస్తున్న నేపథ్యంలో మరి ఈ సినిమాతో కొత్త ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.
Please Read Disclaimer