అసలు శిరీష్ గురించి ఆలోచిస్తున్నారా?

0

అల్లు అర్జున్ ఒక వైపు సూపర్ హిట్స్ అందుకుంటూ టాలీవుడ్ టాప్ స్టార్ హీరోగా దూసుకు పోతున్నాడు. మరో వైపు తండ్రి అల్లు అరవింద్ పదుల సంఖ్యలో సినిమాలు నిర్మిస్తున్నాడు. చిన్నా పెద్దా సినిమాలతో అల్లు అరవింద్ చాలా బిజీగా ఉన్నాడు. ఇక అల్లు వారి పెద్దబ్బాయి కూడా నిర్మాణంలోకి అడుగు పెట్టాడు. వరుణ్ తో ప్రస్తుతం ఒక సినిమాను అల్లు బాబీ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. అల్లు ఫ్యామిలీ కి చెందిన ఈ ముగ్గురు చాలా బిజీగా ఉన్నా కూడా అల్లు శిరీష్ మాత్రం కారణం ఏంటో కాని సినిమాలేమి చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు.

అల్లు శిరీష్ హీరోగా సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. మంచి కథ కోసం ఎదురు చూస్తున్నట్లు గా గతంలో రెండు మూడు సార్లు చెప్పిన శిరీష్ ఇప్పటి వరకు తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టలేదు. అల్లు వారి గీతాఆర్ట్స్ వద్ద ఎప్పుడు పదుల సంఖ్యలో కథలు పెండ్డింగ్లోనే ఉంటాయి. అయినా కూడా వాటిల్లోంచి ఒక్కటి కూడా శిరీష్ కు నచ్చడం లేదా అంటూ మెగా ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అసలు శిరీష్ కు హీరోగా సినిమా చేసే ఆలోచన ఉందా లేదా అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.

అదుగో ఇదుగో అంటూ ఇన్నాళ్లు వెయిట్ చేయిస్తున్న శిరీష్ కు అల్లు అరవింద్ అయినా ఒక మంచి ప్రాజెక్ట్ ను సెట్ చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇంకా కొన్నాళ్ల పాటు సినిమాలు ఏమీ చేయకుండా ఉంటే ప్రేక్షకులు మర్చి పోవడంతో పాటు మళ్లీ కెరీర్ మొదటి నుండి మొదలు పెట్టాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అరవింద్.. బన్నీ.. బాబీలు అసలు శిరీష్ గురించి ఆలోచిస్తున్నారా అంటూ కొందరు నెటిజన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-