రిస్క్ చేస్తున్న మెగా పవర్ స్టార్

0

మెగా పవర్ స్టార్ చరణ్ హీరోగా నిర్మాతగా రెండు పడవల్ని నడిపిస్తున్న సంగతి తెలిసిందే. `రంగస్థలం` ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచాక చరణ్ ఇమేజ్ మార్కెట్ లో రెట్టింపు అయింది. 200 కోట్ల క్లబ్ లో రంగస్థలం చేరడంతో చరణ్ బిజినెస్ రేంజ్ ఆల్మోస్ట్ రెట్టింపైంది. వినయ విధేయ రామ రూపంలో పరాజయం మార్కెట్ వర్గాల్లో బ్యాడ్ అయినా.. నెమ్మదిగా చరణ్ దానిని మసకబారేలా చేస్తున్నాడు. ప్రస్తుతం ఇడియాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ లో నటిస్తుండడం అతడికి పెద్ద ప్లస్ కానుంది. ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే సినిమాపై భారీ అంచానాలు ఏర్పడ్డాయి. సక్సెస్ దక్కితే చరణ్ ఇమేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరుకోవడం ఖాయం.

`జంజీర్` రీమేక్ తో బాలీవుడ్ కి పరిచయమైనా ఆ సినిమా డిజాస్టర్ అవ్వడం నిరాశపరిచింది. అందుకే ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ తో ఆ మరకను చెరిపేయాలన్న పంతంతో ఉన్నాడట. ఓవైపు ఇన్ని సాహసాలు చేస్తూనే.. చెర్రీ చేస్తున్న మరో సాహసం ఆశ్చర్య పరుస్తోంది. చరణ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రచారం వేడెక్కిస్తోంది. ప్రదీప్ అనే ఓ కొత్త కుర్రాడు వినిపించిన స్క్రిప్ట్ కు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ప్రదీప్ తో చాలా కాలంగా డిస్కషన్ సాగుతోంది. ఈ నేపథ్యంలో పలుమార్లు స్క్రిప్ట్ కు సంబంధించిన బెటర్ మెంట్స్ చేశారని తెలుస్తోంది.

చిరంజీవి సైతం ఆ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు సూచించడం తో ఆ ఛేంజెస్ ఇరువురుకి అంగీకారం కావడం తో స్క్రిప్ట్ లాక్ చేసేసినట్టేనని వినిపిస్తోంది. అంతా అనుకున్నట్లు గనుక జరిగితే ఆర్.ఆర్.ఆర్ తర్వాత చరణ్ పట్టాలెక్కించే ప్రాజెక్ట్ ఇదేనని బలమైన ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం నిజమైతే గనుక చరణ్ రిస్క్ తీసుకుంటున్నట్లేనని భావించవచ్చు. హీరోగా చరణ్ రేంజ్ పై లెవల్లో ఉంది. అదీ ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ అయితే పాన్ ఇండియా స్టార్ అవుతాడు. మరి ఇలాంటి సమయంలో కొత్త దర్శకుడితో చరణ్ సాహసం ఎంత వరకూ కరెక్ట్ అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఒక పాన్ ఇండియా మూవీ తర్వాత ఇరుగు పొరుగు భాషల అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమా చేయాల్సి ఉంటుంది. మరి నవతరం దర్శకుడు ప్రదీప్ ఆ రేంజ్ కథని వినిపించాడా? అన్నది చూడాలి. ఇక కొత్త దర్శకుడి లో ట్యాలెంట్ ని గుర్తించి అవకాశం ఇచ్చి.. రిస్క్ చేయాలనుకోవడం స్టార్ హీరోల గొప్పతనమేనని భావించాల్సి ఉంటుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-