‘దర్బార్’ ఎన్నిటికి కాపీనో తెలుసా?

0

తలైవా రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘దర్బార్’. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార కథానాయిక. సుధీర్ఘ విరామం తరువాత రజనీ పోలీస్ పాత్రలో నటిస్తున్న చిత్రమిది. శంకర్ రూపొందించిన ‘2.0’తో చేతులు కాల్చుకున్న లైకా ప్రొడక్షన్స్ మరోసారి డేర్ చేసి మరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘2.0’ భారీ పరాజయాన్ని చవిచూడటంతో ఈ చిత్రంపై లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ఆశలన్నీ ఉన్నాయట. అయితే ఆయన అంచనాల్ని ‘దర్బార్’ నిలబెడుతుందా లేదా? అన్న చర్చ సాగుతోంది. దీనికి కారణం. ‘దర్బార్’ ఇప్పటి వరకు వచ్చిన పోలీస్ చిత్రాల కంటే కొత్తగా ఏం ఉంటుందోనన్న ఆందోళన మార్కెట్ వర్గాల్లో నెలకొంది. ఇప్పటివరకూ రిలీజైన పోస్టర్లు.. మోషన్ పోస్టర్ ని బట్టి ఇది ఎన్నో కాప్ సినిమాలకు పక్కా కాపీ అంటూ గుసగుసలు మొదలయ్యాయి.

బిగ్‌బి అమితాబ్ బచ్చన్ నటించిన ‘జంజీర్’.. శశికపూర్ నటించిన దీవార్.. వినోద్ ఖన్నా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ.. ఓంపురి ‘అర్థ్‌సత్య’.. మనోజ్ బాయ్‌పాయ్ నటించిన ‘శూల్’.. ఆమీర్‌ఖాన్ నటించిన ‘సర్ఫరోష్- తలాష్.. అజయ్ దేవ్గన్ నటించిన గంగాజల్ ఇవన్నీ బాలీవుడ్ లో కాప్ డ్రామాలే. ఇవన్నీ ముంబై బ్యాక్ డ్రాప్ కాప్ స్టోరీలతో తెరకెక్కి విజయం సాధించినవే.

ఇక సౌత్ వరకూ వస్తే.. సూర్య సింగం చిత్రాలతో పాటు పవన్‌కల్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్‌సింగ్ కాప్ స్టోరీలే. ముఖ్యంగా పోస్టర్లలో రజనీ ఆహార్యం చూస్తుంటే గబ్బర్ సింగ్ కి కాపీలా వుందే అంటూ సెటైర్లు వేస్తున్నారు కొందరైతే. ఇది రజనీ తెలుగు అభిమానుల్ని కలవరపరుస్తోంది. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ టీజర్ తర్వాతా ఇదే మాట వినిపిస్తోంది. ముంబై నేపథ్యంలో కాప్ స్టోరీగా రాబోతున్న ఈ చిత్రంలో రజనీ డీజీపీ ఆదిత్య ఆరుణాచలంగా కనిపించబోతున్నారు. రజనీ- మురుగదాస్ ల తొలి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే వున్నాయి. జనవరి 15న తెలుగు-తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. అయితే మురుగదాస్ ఈ కాప్ స్టోరీని ఎంత యూనిక్ గా చూపిస్తాడు? అన్నదానిని బట్టే విజయం ఆధారపడి ఉంటుంది. ఇక తెలుగులో రజనీ మార్కెట్ అంతంత మాత్రమే కాబట్టి దర్బార్ ప్రీబిబినెస్ రేంజ్ ఎలా ఉండబోతోంది? అన్న ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో నెలకొంది. రజనీ గత ట్రాక్ రికార్డు దర్బార్ కి మైనస్ గా మారుతుందా అంటూ విశ్లేషణ సాగుతోంది. కొన్నిటికీ కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది మరి!
Please Read Disclaimer