ఐకాన్ కోసం కాల్విన్ క్లెయిన్ భామ!

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్లో 19 వ చిత్రం కాగా నెక్స్ట్ రెండు సినిమాలు కూడా సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీగా ఉన్నాయి. అందులో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే #AA20. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ కూడా లైన్లో ఉంది. అయితే ఈ రెండు సినిమాలలో ఏది ముందుగా సెట్స్ మీదకు వెళ్తుందనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.

కానీ ‘ఐకాన్’ ప్రీ ప్రొడక్షన్ మాత్రం జోరుగా సాగుతోందని సమాచారం. వేణు శ్రీరామ్ చెప్పిన కథ అల్లు అర్జున్ కు విపరీతంగా నచ్చిందనే టాక్ ఉంది. కథలో యూనివర్సల్ అప్పీల్ ఉండడంతో ప్యాన్ ఇండియా ఫిలింగా తీర్చిదిద్దాలనే ఆలోచనలలో నిర్మాత దిల్ రాజు ఉన్నారట. అందుకే ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక క్రేజీ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. మొదట బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ను సంప్రదించారని.. అయితే ఆమె ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉండడంతో ఈ ఆఫర్ ను స్వీకరించలేదట. దీంతో మరో బాలీవుడ్ హాటీ దిశా పటానిని హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో రాజుగారు ఉన్నారట. ఈ సినిమా ఆఫర్ ను దిశా ఒప్పుకోవడం ఖాయమేనని అంటున్నారు.

అలియా క్రేజ్ ఒక రకమైనదైతే.. దిశా క్రేజ్ మరో రకమైనది. ఆ రాగం వేరు ఈ తాళం వేరు. గ్లామర్ తో దిశా వెండి తెరను వేడెక్కించగలదు. ఇన్నర్ బ్యూటీతో మాస్ ప్రేక్షకులను కాల్చుకు తినగలదు. దిశాను తీసుకోవడం నార్త్ మార్కెట్ కు కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కు ఎలాగూ నార్త్ ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ స్టైలిష్ స్టార్ -హాట్ బ్యూటీ జోడీని చూసి హిందీ ప్రేక్షకులు భ..గ..వా..న్ అనక తప్పదు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home