స్టార్ హీరో సినిమాకు ధర పలకడం లేదా?

0

ఆయన ఓ పెద్ద స్టార్ హీరో. కొంత గ్యాప్ తర్వాత మరోసారి హీరోగా ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. సాధారణంగా పెద్ద స్టార్ హీరో ఇలా గ్యాప్ తర్వాత సినిమా చేస్తుంటే ఆ సినిమాపై భారీ క్రేజ్ ఉంటుంది కానీ ఈ సినిమాపై ఎందుకో కానీ ఆ స్థాయి క్రేజ్ కనిపించడం లేదు. ఈ స్టార్ హీరో శైలికి భిన్నంగా ఉండే కథను ఎంచుకోవడమే దానికి కారణం అని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సోషల్ మీడియాలో మాత్రం సినిమాకు క్రేజ్ ఉందంటూ ఊదరగొడుతున్నారు కానీ వాస్తవానికి బిజినెస్ విషయంలో అది కనిపించడం లేదు. డిజిటల్ రైట్స్ విషయం లో నిర్మాతలు ఆశించినంత రేట్లు రావడం లేదట. ఆ ప్రకారం లాస్ వచ్చినట్టేనని అంటున్నారు. థియేట్రికల్ రైట్స్ కూడా తక్కువ రేట్లు ఆఫర్ చేస్తున్నారట. నిర్మాత భారీగానే చెప్తున్నప్పటికీ బయ్యర్లు మాత్రం దానికి వ్యతిరేకంగా తక్కువ ధర చెప్తున్నారట. దీంతో నిర్మాత గారు ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ పెడదామని ఆలోచనలో ఉన్నాడట. దీంతో క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నాడట. అయితే హీరో మాత్రం వద్దని చెప్పాడట.

మరి ఈ ఐటెం సాంగ్ విషయంలో నిర్మాత మాటే నెగ్గుతుందా లేదా హీరోగారు చెప్పినట్టే ఐటెం సాంగ్ పెట్టకుండానే సినిమా ను పూర్తి చేస్తారా అనేది వేచి చూడాలి. ఇప్పటికే ఈ సినిమా కథకు సంబంధం లేకుండా హీరో ఇమేజ్ కోసం సినిమాను కిచిడి చేస్తున్నారనే టాక్ ఉంది. ఇక ఈ ఐటెం సాంగ్ కూడా పెడితే 100% కిచిడి అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-