దర్బార్ కు ఇక్కడ ఆదరణ దక్కుతుందా?

0

సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ తమిళనాట మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఉంది. అయితే ఈమధ్య వరసగా రజనీ సినిమాలు తెలుగులో నిరాశ పరుస్తున్నాయి. దీంతో రజనీ మార్కెట్ నానాటికి తీసికట్టుగా మారింది. రజనీ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 10 న రిలీజ్ కానుంది.

ఈమధ్యే ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రైలర్ కు తమిళ ప్రేక్షకుల్లో భారీ స్పందన దక్కింది. రజనీ రెగ్యులర్ స్టైల్ మేనరిజం.. పంచ్ డైలాగ్స్ వారిని మెప్పించాయి. అయితే తెలుగు వెర్షన్ కు ఆశించినంత స్పందన దక్కలేదు. ఈ సినిమా అసలే సంక్రాంతి సీజన్లో జనవరి 10 వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతోంది. జనవరి 11 వ తారీఖున మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’.. జనవరి 12 న అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో విడుదల అవుతోంది. ఇలాంటి పోటీలో రిలీజ్ అవుతున్న ‘దర్బార్’ కోసం ప్రేక్షకులు ఎగబడే పరిస్థితి లేదని.. ఓపెనింగ్స్ కూడా పెద్దగా వచ్చే అవకాశం లేదని ట్రేడ్ వర్గాల వ్యాఖ్యానిస్తున్నారు. అటు రజనీ సినిమాలు నిరాశ పరుస్తుండడం.. ఇటు మురుగదాస్ కూడా ‘స్పైడర్’ తో తెలుగు ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చి ఉండడమే ఇందుకు కారణం అని అంటున్నారు.

అయితే రజనీకాంత్ మ్యాజిక్ ను మనం ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్యలేం. రెగ్యులర్ రజనీ స్టైల్ సీన్లు మాత్రమే కాకుండా ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంటే మాత్రం తన సత్తా చాటగలరు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Please Read Disclaimer