డార్లింగ్ వచ్చి ఉంటే ?

0

ఈ రోజు రెండు తెలుగు సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. వాటిలో ఒకటి శర్వా నటించిన ‘రణరంగం’ కాగా రెండోది అడివి శేష్ ‘ఎవరు’. అలాగే హిందీలో అక్షయ్ కుమార్ ‘మిషన్ మంగళ్’ కూడా ఈరోజే థియేటర్స్ లోకి వచ్చింది.ఈ మూడు సినిమాలతో మూవీ లవర్స్ హాలిడేను జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇదే రోజు ‘సాహో’ రిలీజ్ అయ్యి ఉండేది. బెనిఫిట్ షోలతో తెల్లవారు జామునుండే హంగామా మొదలయ్యేది.

అసలే ప్రభాస్ సినిమా వచ్చి రెండేళ్ళయింది. ఈ రోజు కానీ ప్రభాస్ థియేటర్స్ లోకి వచ్చి ఉంటే ఫెస్టివల్ సెలెబ్రేషన్స్ మరోలా ఉండేవి. అందరూ థియేటర్స్ కి క్యూ కట్టేవారు. మీడియాలో ఎక్కడ చూసినా ‘సాహో’ మేనియానే కనిపించేది. అలా అనుకోకుండా ఇండిపెండెన్స్ డే ని మిస్ అయ్యాడు రెబెల్ స్టార్. ఇక డార్లింగ్ సినిమా కోసం మరో 15 రోజులు వైయిట్ చేయక తప్పదు.

కానీ సాహో పోస్ట్ ఫోన్ అవ్వడం ‘రణరంగం ఎవరు లకు బాగా కలిసొచ్చింది. మంచి స్లాట్ దొరికింది. ఉన్నంతలో ఈ రోజు ఈ రెండు సినిమాలు మంచి కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది. హాలిడే పైగా రెండు అంతో ఇంతో ఆసక్తి కలిగించిన సినిమాలే. మరి ఓపినింగ్స్ తో బాక్సాఫీస్ దగ్గర నిలబడతాయో లేదో చూడాలి.
Please Read Disclaimer