`గ్యాంగ్ లీడర్` డైలమాలో ఉన్నాడా?

0

ఒకే తేదీకి మూడు నాలుగు సినిమాలు రిలీజవుతుంటే నిర్మాతలకు రకరకాల టెన్షన్లు ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ సోలో రిలీజ్ కోసం ఆరాటపడతారు. కానీ పోటీ ప్రపంచంలో అసలు అది కుదరని పని. ఏడాదికి 200 సినిమాలు రిలీజవుతున్నాయి కాబట్టి ఉన్న 52 వారాల్లోనే సర్ధుకోవాల్సి ఉంటుంది. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా ఇదే సన్నివేశం ఎదుర్కోవాలి.

ఏదైనా క్రేజు ఉన్న సినిమా వస్తోంది అంటే ఆటోమెటిగ్గా ఇతరులు అటూ ఇటూ జరుగుతుంటారు. అలాంటి క్రేజు ఉన్న సినిమాలు ఈ ఆగస్టులో ఏం ఉన్నాయి? అని చూస్తే ఆ జాబితాలో `సాహో` తో పాటు మరికొన్ని ఉన్నాయి. ఆగస్టు 30న వస్తున్న నాని `గ్యాంగ్ లీడర్`కి స్థానం ఉంది. సాహోతో వేరే సినిమాలేవీ పోటీపడడం లేదు కానీ.. నాని గ్యాంగ్ లీడర్ కి మాత్రం కొందరు పోటీగానే ఉన్నారని తెలుస్తోంది. పోటీ పడుతున్నా గ్యాంగ్ లీడర్ కి వేరొక సినిమా అడ్డు లేకుండా ఉండేలా ప్లాన్ చేశారు. ఆగస్టు 30వ తేదీని ముందే ప్రకటించేశారు కాబట్టి ఆ తేదీకి వేరే సినిమాలేవీ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారట.

అయితే చెప్పిన తేదీకే నాని సినిమా వస్తుందా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్ అని భావిస్తున్నారు. సెట్స్ లో నానీకి గాయం అవ్వడంతో కొంత విరామం తప్పలేదు. అలాగే కథలో అవసరం మేర మార్పు చేర్పులు యాడింగ్స్ చేయడం మరికొంత షూట్ వాయిదాకి కారణమైందని చెబుతున్నారు. కారణం ఏదైనా చెప్పిన తేదీకి గ్యాంగ్ లీడర్ రాకపోవచ్చని సెప్టెంబర్ కి వాయిదా పడిందని మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఈ సినిమా క్లియరెన్స్ కోసం వేచి చూసిన వారంతా ఆగస్టు 30న తమ సినిమాల్ని రిలీజ్ చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికైతే ఆ తేదీని వదిలేయడం లేదని నాని నిర్మాతలు (మైత్రి అధినేతలు) కాన్ఫిడెంట్ గా ఉన్నారట. దీంతో ఇతరులు డైలమాలో ఉన్నారని తెలుస్తోంది. ఎలాంటి క్లాషెస్ లేకుండా వెళితేనే మంచిదన్నది అందరి అభిప్రాయం కాబట్టి ఈ డైలమా నుంచి బయటపడి గ్యాంగ్ లీడర్ రిలీజ్ తేదీ ఇదీ అని కన్ఫామ్ గా చెప్పాల్సి ఉంటుంది. ఇంతకీ గ్యాంగ్ లీడర్ ఆగస్టు 30న వస్తుందా.. రాదా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.
Please Read Disclaimer