గ్యాంగ్ లీడర్ మాట తప్పుతాడా ?

0

నాని గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ 13 రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుని దానికి తగ్గట్టే ప్రమోషన్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇది రెండు సార్లు డేట్ మారింది. మొదట్లో ఆగస్ట్ 23 అనుకున్నారు. ఆ తర్వాత 30కి వెళ్లారు. తీరా సాహో నాక్కావాలి అని వచ్చేయడంతో నానితో సహా అందరూ తప్పుకున్నారు. ఇదంతా ఎందుకులే అని ఫైనల్ గా సెప్టెంబర్ 13 ఫిక్స్ అయ్యారు. ఇంతా చేసినా వరుణ్ తేజ్ వాల్మీకితో ఫేస్ టు ఫేస్ క్లాష్ తప్పడం లేదు.

దానికన్నా ఒక రోజు కిచ్చ సుదీప్ పెహల్వాన్ వస్తోంది. ఇది తెలుగు రాష్ట్రాల్లో కాకపోయినా కర్ణాటక తమిళనాడులో గట్టి పోటీనే ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఇన్ని అడ్డంకుల మధ్య 13 రిస్క్ చేద్దామా వద్దా అనే ఆలోచనలో మైత్రి నిర్మాతలు ఉన్నట్టు ఫ్రెష్ అప్ డేట్. ఒకవేళ 19కి షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న కోణంలో కూడా చర్చలు జరుగుతున్నాయట. ఆ డేట్ కి నెక్స్ట్ డే వచ్చే సూర్య బందోబస్త్ తప్ప ఇంకే పోటీ లేదు. దానివల్ల వచ్చిన చిక్కేమి లేదు

కానీ ఇదంతా ప్రస్తుతం పుకారు దశలోనే ఉంది. ఇవాళ చిరు పుట్టినరోజు సందర్భంగా వదిలిన పోస్టర్ లో సైతం నాని గ్యాంగ్ లీడర్ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 13 అనే పేర్కొన్నారు. కాకపోతే ప్రమోషన్ పరంగా టీమ్ ఇంకా వేగం పెంచాల్సి ఉంది. సాహో ఫీవర్ తగ్గాక ఉధృతమైన పబ్లిసిటీ చాలా అవసరం. మరోవైపు వాల్మీకి కూడా ఇదే ప్లానింగ్ తో ఉంది. మాస్ పరంగా చూసుకుంటే వాళ్ళు అధిక శాతం వాల్మీకి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఫామిలీస్ నానికి ఓటు వేసినా వాల్మీకి మాస్ ని లాగేసుకుంటే కలెక్షన్ల ఫిగర్స్ లో తేడాలు వచ్చేస్తాయి. ఇవన్నీ ఎందుకనుకుని ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చిన 13కే ఫిక్స్ అవుతాడో లేక నాని గ్యాంగ్ లీడర్ మాట తప్పుతాడో వేచి చూడాలిPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home