రష్మికపై అతడు ఇంకా కోపంగానే ఉన్నాడా?

0

కన్నడ సూపర్ హిట్ చిత్రం ‘కిరాక్ పార్టీ’ తో రష్మిక మందన్న మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమాలో రష్మికను చూసే వెంకీ కుడుముల ‘ఛలో’ చిత్రం కోసం ఎంపిక చేసిన విషయం తెల్సిందే. కిరాక్ పార్టీ చిత్రంలో రక్షిత్ శెట్టికి జోడీగా నటించిన రష్మిక అదే సమయంలో అతడి తో ప్రేమలో పడినది. ప్రేమ పెళ్లి వరకు వెళ్లి నిశ్చితార్థం వరకు వెళ్లింది. అయితే టాలీవుడ్ లో ఒక్కసారిగా బిజీ అవ్వడంతో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది.

నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన నేపథ్యంలో ఇద్దరు కూడా ఇష్టపూర్తిగానే బ్రేకప్ అయినట్లుగా చెప్పుకొచ్చారు. అయితే రష్మికపై రక్షిత్ కు ఇంకా కోపం ఉన్నట్లుగానే తెలుస్తోంది. ప్రస్తుతం రక్షిత్ శెట్టి సూపర్ హిట్ మూవీ కిరాక్ పార్టీకి సీక్వెల్ చేసే పనిలో ఉన్నాడు. ఆ సీక్వెల్ కు ఎక్కువగా కిరాక్ పార్టీకి వర్క్ చేసిన వారే చేస్తున్నారు. ఆ కారణంగా సీక్వెల్ లో రక్షిత్ శెట్టికి జోడీగా రష్మిక మందన్న జోడీగా మళ్లీ నటించే అవకాశం ఉందని అంటున్నారు.

కన్నడ మీడియా ఈ విషయమై ఆయన వద్ద ప్రస్థావించగా కిరాక్ పార్టీకి సీక్వెల్ మాట వాస్తవమే కాని అంతా కొత్త వారితో చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. కనీసం ఆయన రష్మిక పేరును కూడా ప్రస్థావించకుండా ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. రక్షిత్ శెట్టి ప్రవర్తన చూస్తుంటే ఇంకా కూడా ఆయనకు రష్మిక పై కోపం ఉన్నట్లుగానే గుసగుసలు వినిపిస్తున్నాయి. రష్మిక మాత్రం కిరాక్ పార్టీ సీక్వెల్ విషయమై తనకు తెలియదు అన్నట్లుగా కన్నడ మీడియా లో కథనాలు వస్తున్నాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-