బెడ్ పై విరహయోగిని.. జాకీ కొత్త ఫోజు

0

శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సినీకెరీర్ ఆశించినంత స్పీడ్ అయితే లేదు. ఇటీవల ఆమెకి పూర్తిగా ఆఫర్లు తగ్గాయి. కొత్త ఛాన్స్ ల కోసం ఎంతగానో ట్రై చేస్తోంది. ఇటీవలే అమెరికాలో ఫిల్మ్ ఎడ్యూకేషన్.. యాక్టింగ్ కి సంబంధించి శిక్షణ తీసుకుని వచ్చిన ఆమె మళ్ళీ తనని తాను నిరూపించుకునే వేటలో పడింది. ప్రస్తుతం జాన్ అబ్రహంతో `డ్రైవ్` అనే చిత్రంలో కలిసి నటిస్తుంది. మరోవైపు తెలుగు ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటుందట. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని.. క్రిష్ దర్శకత్వంలో రూపొందే పీరియాడికల్ యాక్షన్ డ్రామా కోసం సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రచారమవుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రగ్యా జైస్వాల్తోపాటు జాక్వెలిన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇందులో వాస్తవం ఎంత అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇటీవల ప్రభాస్ నటించిన `సాహో`లో బ్యాడ్ బోయ్ సాంగ్ లో ఆడిపాడిన సంగతి తెలిసిందే.

తాజాగా జాక్వెలిన్ ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ కి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈ సిరీస్ లేటెస్ట్ ఫోటో ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేసింది. బెడ్ పై విరహయోగినిలా ఉన్న ఓ సెల్ఫీని జాకీ షేర్ చేసింది. ఇందులో మేకప్ లేకుండా ఎల్లో కలర్ టాప్ తో.. బెడ్ పై పడుకుని కవ్విస్తోంది. ఈ ఫోటో ఇప్పుడు అన్ని సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతుంది. పడక గదిలో జాక్వెలిన్ షోని చూసి నెటిజనులు ఫిదా అయిపోతున్నారు.

2006లో మిస్ శ్రీలంక విజేతగా నిలిచి.. అటుపై సినీ తెరంగేట్రం చేసిన జాక్వెలిన్ ఇటీవల తన పేరును మార్చుకోవాలనుకుంటున్నానని తెలిపింది. ఇంగ్లీష్ పేరుతో ఇండియాలో సినిమాలు చేయడం వల్లే సరిగ్గా ఆఫర్స్ రావడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయట. అంతేకాదు కొందరు తన పేరుని మార్చుకోవాలని సూచించారట. ఇలా మరింత మంది ఇచ్చే సలహాలను జాక్వెలిన్ ఆసక్తికరంగా వింటున్నట్టు తెలుస్తుంది. మరి నిజంగానే తన పేరును మార్చుకుంటుందా? .. ఒకవేళ పేరు మార్చుకుంటే తనకి కలిసొస్తుందా? అనేది చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-