‘తలైవి’లో హీరోయిన్ కంగనా కాదా?

0

సోషల్ మీడియా లో తలైవి ఫస్ట్ లుక్ పో మీమ్స్ ఆగడం లేదు. నెటిజన్స్ ఒక రేంజ్ లో తలైవి సినిమాను ఆడుకుంటున్నారు. గతంలో ఏ సినిమా ఫస్ట్ లుక్ పై రాని నెగటివ్ కామెంట్స్.. నెగటివ్ మీమ్స్ తలైవికి మాత్రమే వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వస్తున్న నెగటివ్ స్పందనతో యూనిట్ సభ్యులు అంతా కూడా ఆలోచనల్లో పడ్డట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అమ్మ జయలలిత పాత్రకు కంగనాను తీసుకోవడమే తప్పుడు నిర్ణయం. ఇక మేకప్ విషయంలో మరీ దారుణం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో మీమ్స్ తో సినిమా ను ట్రోల్ చేస్తున్నారు. జయలలిత బయోపిక్ తీస్తామని తలైవి టైటిల్ పెట్టి ఇప్పుడు మీరు తీస్తున్నది ఏంటీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు జయలలిత మాదిరిగా కాస్ట్యూమ్స్ వేస్తే ఎవరైనా జయలలిత అయిపోతారా అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక కొందరు తలైవిలో నిన్న మొన్నటి వరకు కంగనా రనౌత్ హీరోయిన్ అంటూ ప్రచారం చేశారు కదా.. ఇప్పుడేంటి కొత్త అమ్మాయిని నటింప జేస్తున్నారు. కంగనా చేయనంటూ హ్యాండ్ ఇచ్చిందా అంటూ మీమ్స్ చేస్తున్నారు.

తలైవి ఫస్ట్ లుక్ పూర్తిగా అమ్మ జయలలిత మాదిరి గా లేదు.. అలా అని ఆ పోస్టర్ లో ఉన్నది కంగనా అంటే నమ్మేట్లుగా లేదు. అసలు ఇలాంటి మేకప్ ను ఎలా చేశారంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యం లో చిత్ర యూనిట్ సభ్యులు దిద్దుబాటు చర్యలు చేపట్టారంటూ ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా కంగనా మేకప్ విషయంలో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తున్నట్లు గా సమాచారం అందుతోంది. మార్పులు చేర్పులు లేకుంటే సినిమాను జనాలు పట్టించుకోవడం కష్టమే అంటూ సోషల్ మీడియా లో టాక్ వినిపిస్తుంది. అందుకే చిత్ర యూనిట్ సభ్యులు ముందు జాగ్రత్త పడుతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
Please Read Disclaimer