రౌడీతో రొమాన్సుకు సై అంటుందా?

0

యువహీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో త్వరలో ‘ఫైటర్’ టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రస్తుతం జోరుగా ప్రీ ప్రొడక్షన్ సాగుతోంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని.. నటీనటులను టెక్నిషియన్లను ఫైనలైజ్ చేసే ప్రయత్నాలలో పూరి టీమ్ బిజీగా ఉందట.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా ఒక క్రేజీ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకుందామనే ఆలోచనలో పూరి ఉన్నారని.. అందుకే కియారా అద్వాని పేరును పరిశీలిస్తున్నారని సమాచారం. కియరా అద్వాని ఇప్పటికే టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసింది. మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’.. రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ లో నటించింది. అయితే ఈ సినిమాల తర్వాత బాలీవుడ్ లో చాలా బిజీ అయింది. మరో తెలుగు సినిమాకు సైన్ చెయ్యలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో నాలుగైదు సినిమాల్లో నటిస్తోంది. మరి ఇంత బిజీ షెడ్యూల్ లో తెలుగు సినిమాకు సైన్ చేస్తుందా అనేది ఆసక్తికరం. అయితే రీసెంట్ గా విజయ్ దేవరకొండతో ఒక అడ్వర్టైజ్మెంట్ లో నటించింది. నిజానికి ఈ యాడ్ లో ఇద్దరి కాంబినేషన్ చూసిన తర్వాతే పూరి ఈ హీరోయిన్ ను ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారట.

ఈ సినిమాకు కియారా ఓకె చెప్తే మాత్రం క్రేజీగా మారుతుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో విజయ్ ఒక బాక్సర్ పాత్రలో నటిస్తాడని సమాచారం. పూరి జగన్నాధ్ ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తారు.
Please Read Disclaimer