రాజశేఖర్ రాజీనామాను మా ఏం చేసింది?

0

ఇటీవల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ సందర్భంగా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రాజశేఖర్ మధ్యలో మైక్ అందుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. దీని పై మా వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి సహా పెద్దలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం.. తదనంతర పరిణామాలతో కలత చెందిన రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేయడం తెలిసిన సంగతే. దీని పై మా స్పందనేంటి.. ఆ రోజు సమావేశంలో చిరంజీవి సూచించిన మేరకు రాజశేఖర్ పై క్రమశిక్షణ చర్యలేమైనా తీసుకుంటారా అని అందరూ ఎదురు చూస్తున్నారు.

కాగా ఆదివారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించిన ‘మా’ రాజశేఖర్ రాజీనామాను ఆమోదించింది. దీంతో పాటు క్రమశిక్షణ చర్యల కోసం ఉన్నతస్థాయి కమిటీని కూడా ‘మా’ నియమించింది. కృష్ణంరాజు చిరంజీవి మురళీమోహన్ మోహన్బాబు జయసుధలతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ‘మా’ ప్రకటన విడుదల చేసింది. మరి రాజీనామాను ఆమోదించి రాజశేఖర్ను ‘మా’కు దూరం పెట్టడంతో సరిపెడతారా.. లేక చిరు కృష్ణం రాజు అన్నట్లు క్రమశిక్షణ చర్యల పేరుతో రాజశేఖర్ మీద సస్పెన్షన్ కూడా విధిస్తారా అన్నది చూడాలి. రాజశేఖర్ ‘మా’కు దూరమైన నేపథ్యంలో సంఘంలో ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతల్లో ఉన్న ఆయన భార్య జీవిత ఏం చేస్తుందన్నది ఆసక్తికరం.
Please Read Disclaimer