పరశురాంకి నో చెప్పాడా

0

60 కోట్లకు పైగా షేర్ వసూలు చేసిన బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ఏడాదిపైగానే ఖాళీగా ఉండటం అంటే చిన్న విషయం కాదు. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు కాని అతన్నుంచి వీలైనంత త్వరగా కొత్త సినిమా ఆశించే ప్రేక్షకులకు అది చేదు వార్తే అవుతుంది. పరశురాం పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. గీత గోవిందంతో ఊహించని ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో త్వరగా ముందడుగు వేయలేకపోతున్నాడు.

గీత ఆర్ట్స్ సంస్థ లాక్ చేసుకున్నప్పటికీ మహేష్ బాబుతో కాంబినేషన్ ని సెట్ చేయాలనీ చాలా ట్రై చేసింది. కాని కథ విషయంలో మహేష్ రాజీ లేని ధోరణి వల్ల చివరిగా స్మార్ట్ నో చెప్పించుకోవాల్సి వచ్చిందని ఫిలిం నగర్ గాసిప్. నిజానికి మహేష్ ఎందుకు నో చెప్పాడో స్పష్టమైన కారణాలు తెలియదు కాని సరిలేరు నీకెవ్వరు తర్వాత ప్రిన్స్ వంశీ పైడిపల్లికి కమిట్ అయ్యాడు. దాని తర్వాత స్క్రిప్ట్ రెడీ అయితే త్రివిక్రమ్ తో లేదా కథ సిద్ధమైతే రాజమౌళితో జాయిన్ అయ్యేందుకు ఎదురు చూస్తున్నాడు.

ఒకవేళ వీళ్ళవి కాకపొతే ఆప్షన్ గా అప్పుడో ఎవరో ఒక స్టార్ డైరెక్టర్ రాకుండా పోడు. ఇంత గ్యాప్ పరశురాంకు ఇబ్బంది అవుతుంది కనక మహేష్ ఆ స్క్రిప్ట్ కు అనుకూలంగా స్పందించలేదని తెలిసింది. కథ కూడా గతంలో ఇతర హీరోలు టచ్ చేసినట్టుగానే అనిపించడం కూడా ఇంకో కారణంగా మరో పుకారు ప్రచారంలో ఉంది. మొత్తానికి పరశురాం ఈ త్రిశంకు స్వర్గం నుంచి ఎప్పుడు బయటికి వచ్చి కొత్త సినిమా మొదలుపెడతాడో చూడాలిPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home