మహేష్ ఫ్యాన్స్ కి మళ్లీ నిరాశే నా?

0

సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడి గా అనీల్ రావిపూడి దర్శకత్వం లో `సరిలేరు నీకెవ్వరు` షూటింగ్ శర వేగంగా పూర్తవుతోంది. చిత్రీకరణ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం కేరళలో ముఖ్య తారాగణం పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఇటీవల పండగల కు రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ఫ్యాన్స్ లోకి దూసుకెళ్లాయి. అయితే ఈ మాత్రం ట్రీట్ ఫ్యాన్స్ కి సరిపోతుందా? టీజర్.. ట్రైలర్.. పాటలు వచ్చేది ఎప్పుడు? అంటూ మహేష్ అభిమానులు చితృ బృందాన్ని అదే పనిగా షంటేస్తున్నారట. కాంపిటీటర్ బన్ని దూసుకు పోతుంటే మహేష్ ని ఇలా దాచేస్తారేం! అంటూ సీరియస్ అవుతున్నారు. ఈ నేపథ్యం లో చిత్ర నిర్మాతలు అదిరిపోయే సర్ ప్రైజ్ అంటూ ప్రకటించారు. ఏమిటా సర్ ప్రైజ్ అంటూ ఎదురు చూసిన వారికి పెద్ద ట్విస్టునే ఇచ్చారు.

ఏదో చేసేస్తారు.. సరిలేరు టీమ్ సైలెంట్ గా టీజర్ వదిలేస్తున్నారు! అంటూ ఆసక్తిగా చూసిన వారికి ఒక్క సారిగా నిరాశ తప్పలేదు. సోషల్ మీడియా లో కొన్ని గంటల ముందు వరకూ జరిగిన ప్రచారాన్ని తుస్సుమనిపించారు. టీజర్ ని రిలీజ్ చేయలేదు సరికదా.. టీజర్- ట్రైలర్ రిలీజ్ తేదీలు అయినా చెప్పలేదు! మహేష్ అభిమానులు ఆశించినదేదీ జరగక పోవడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. సైలెంట్ గా మహేష్ కు సంబంధించిన 3 సెకెన్ల నిడివి గల క్లిపింగ్ ని మాత్రమే రిలీజ్ చేయడంతో అభిమానుల్లో నీరసం తో పాటు కోపం పొంగుకొచ్చింది. టీజర్ లోడింగ్.. ఇంకా వెయిట్ చేయండి అంటూ ఊస్సురనిపించడం తో ఏమీ చేయలేక ఫ్యాన్స్ చతికిలబడిపోయారు పాపం.

సరిలేరు టీజర్ ఈనెల 23న రిలీజ్ అవుతుందని ఎంతో ప్రచారం సాగి పోయాక ఇలా నిరాశపరిచారన్న ఆవేదన సోషల్ మీడియా లో కనిపిస్తోంది. ఇంతకీ టీజర్ రిలీజ్ ఎప్పుడో? దర్శకుడైనా చెబుతాడా? చూడాలి. ఇందులో మహేష్ సరసన రష్మిక మందన నటిస్తోంది. సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్- జిఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్- శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చిత్రాన్ని సంయుక్తం గా నిర్మిస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
Please Read Disclaimer