‘ఆచార్య’లో మహేష్ లేడు.. కారణం ఇదేనట!

0

మెగాస్టార్ 152 చిత్రం ‘ఆచార్య’ గురించి రోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అయితే అందరి దృష్టిని అత్యధికంగా ఆకర్షించిన వార్త ఏంటీ అంటే ఈ చిత్రంలో కీలక పాత్రలో మహేష్ బాబు నటించబోతున్నాడు. మహేష్ బాబు 30 రోజుల పాటు ఆచార్య చిత్రం కోసం షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ వార్త సినిమాపై అంచనాలను పీక్స్ కు తీసుకు వెళ్లాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆచార్యలో మహేష్ బాబు లేడు. మొదట అనుకున్నట్లుగానే లాభమో నష్టమో రామ్ చరణ్ తోనే చేయించాలని నిర్ణయించారట.

మహేష్ బాబు 30 రోజులకు ఏకంగా 30 కోట్ల పారితోషికం డిమాండ్ చేశాడంటూ వార్తలు వచ్చాయి. 30 కోట్ల పారితోషికం ఆయనకు ఇస్తే సినిమా బడ్జెట్ శృతి మించుతుందనే ఉద్దేశ్యంతో ఆయనకు దూరం అయినట్లుగా టాక్ వినిపిస్తుంది. మెగాస్టార్ తో రామ్ చరణ్ నటించినా కూడా సినిమాకు ఖచ్చితంగా భారీ బజ్ క్రియేట్ అవ్వడం ఖాయం. ఆ కారణంగానే మహేష్ బాబు లేకున్నా పర్వా లేదని యూనిట్ సభ్యులు అనుకున్నారట.

సినిమా బడ్జెట్ ఇప్పటికే పరిమితి దాటే ప్రమాదం ఉందని భావిస్తున్నారట. ప్రధానంగా బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని మహేష్ బాబును వద్దనుకున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్త మహేష్ బాబు ఇంకా మెగా ఫ్యాన్స్ కు కాస్త నిరుత్సాహం కలిగించే విషయమే. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-