మెగాస్టార్ కు మరో ఛాన్స్ లేదా?

0

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణ ఎట్టకేలకు పూర్తయ్యింది. ఆ సినిమాకు డబ్బింగ్ ను కూడా చిరంజీవి పూర్తి చేశాడని సమాచారం అందుతోంది. ఇక ప్రస్తుతం సైరా చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సైరా తన బాధ్యతను పూర్తి చేసిన చిరంజీవి ప్రస్తుతం తన 152వ చిత్రంకు సంబంధించిన పనిలో పడ్డట్లుగా తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఆ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి.

ఇప్పటికే ముంబయి నుండి వచ్చిన ట్రైనర్ ఆధ్వర్యంలో చిరంజీవి బరువు తగ్గే పనిలో బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సినిమాను పట్టాలెక్కించే విధంగా పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఈ చిత్రం కోసం రెండు భారీ సెట్టింగ్స్ ను వేస్తున్నారు. సినిమాలో ఎక్కువ శాతం ఆ సెట్టింగ్స్ లో చిత్రీకరణ జరుగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో నటించబోతున్న హీరోయిన్ విషయంలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. పలువురు హీరోయిన్స్ పేరు పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ చిత్రం హీరోయిన్ విషయంలో చిరంజీవి ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.

కొరటాల సిద్దం చేసిన కథానుసారం చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. అందుకోసం ఇద్దరు హీరోయిన్స్ కావాల్సి ఉంది. అందులో ఒక హీరోయిన్ పాత్ర చాలా హుందాగా కనిపించాల్సి ఉంటుందట. దాంతో ఆ పాత్రకు నయనతార అయితేనే బాగుంటుందని చిరంజీవి భావిస్తున్నారని సమాచారం అందుతోంది. మరో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

రామ్ చరణ్ ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ తో కలిసి నిర్మిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు కొరటాల దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే ఈ చిత్రం కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్ ఉన్నారు.
Please Read Disclaimer