ఆ సినిమాలో మెగాస్టార్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారా..?

0

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ఆచార్య. ఈ సినిమా పై మెగా అభిమానులలో ఓ రేంజిలో ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మాట్నీ ఎంటర్టైన్మెంట్ కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తయిందట. సామాజిక అంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమాను రూపొందిస్తున్నాడట డైరెక్టర్. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ సినిమాలో మెగాస్టార్ పాత్ర ఎండోమెంట్స్ అధికారిగా చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుందట. అంతేగాక చిరు డ్యూయెల్ రోల్స్ పోషిస్తున్నట్లు సమాచారం. గతంలో కనిపించే ఒక చిన్న పాత్ర కూడా ఉంటుందని అంటున్నారు. ఇక చిరు హీరో ఎలివేషన్స్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తాయని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ట్విస్టులు పోరాట ఘట్టాలు.. ఇలా అన్నీ అంశాలు మేళవించానని ఇదివరకే చెప్పాడు కొరటాల. చిరు కోసం బాగా ఎమోషన్స్ తో కూడిన బలమైన డైలాగ్స్ యాక్షన్ సన్నివేశాలు కోకొల్లలుగా ఉన్నాయట. అయితే ఈ సినిమాలో రాంచరణ్ కూడా ఓ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ స్ఫూర్తి పొందేది చరణ్ పాత్రనుండేనట. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నిహారిక కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరు తన తదుపరి సినిమా లూసిఫర్ కోసం కూడా సిద్ధం అవుతున్నాడట. ఇక హీరోయిన్ కాజల్ త్వరలోనే ఆచార్య షూటింగులో పాల్గొననుంది. మరో విశేషం ఏంటంటే రాంచరణ్ సరసన కూడా ఓ హీరోయిన్ కనిపించనుందట. ఆమె ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందేనట!
Please Read Disclaimer