మెగాస్టార్ సినిమా డార్లింగ్ చేతికి వచ్చిందా?

0

ప్రభాస్ కొత్త సినిమా ప్రకటన అందరికీ ఓ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ‘మహానటి’ లాంటి అద్భుత చిత్రం రూపొందించి కమర్షియల్ విజయంతో పాటుగా ప్రశంసలు కూడా దక్కించుకున్నాడు నాగ్ అశ్విన్. మహానటి డైరెక్టర్ తో సినిమా అనగానే ప్రభాస్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ‘మహానటి’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి కోసం నాగ్ అశ్విన్ కోసం సైన్స్ ఫిక్షన్ కథను రెడీ చేస్తున్నాడని.. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తామని గతంలో అశ్వినిదత్ ప్రకటించారు. ఆ స్క్రిప్టుకే ఇప్పుడు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. నిజానికి ఈ స్క్రిప్ట్ ను మెగాస్టార్ కోసమే తయారు చేశారట. నాగ్ అశ్విన్ కథ వినిపించిన తర్వాత ఈ కథ ప్రభాస్ కు అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని చిరంజీవి భావించి ప్రభాస్ వద్దకు పంపారట. కథ నచ్చడంతో ప్రభాస్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

ప్రభాస్ గత కొంతకాలంగా కొత్త స్క్రిప్టులు వింటున్నారు. సురేందర్ రెడ్డి.. సందీప్ వంగా లాంటి డైరెక్టర్లు తీసుకొచ్చిన కథలు వింటున్నారు. అయితే ఎవరికీ పచ్చజెండా ఊపలేదు. నాగ్ అశ్విన్ కథ మెప్పించడంతో ఎక్కువ సమయం తీసుకోకుండానే ఓకే చెప్పారట.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-