నిధి ‘ఎంగేజ్డ్’ స్టేటస్ తో ఫ్యాన్స్ షాక్

0

అక్కినేని బ్రదర్స్ తో ‘సవ్యసాచి’ మరియు ‘మిస్టర్ మజ్ను’ చిత్రాల్లో నటించిన నిధి అగర్వాల్ ఇటీవలే పూరి ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో నటించి మంచి గుర్తింపును దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు పలు ప్రాజెక్ట్ లు చర్చల దశలో ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈమెను ఫాలో అయ్యే వారు తాజాగా ఆమె స్టేటస్ ను చూసి షాక్ అయ్యారు. ప్రముఖ సోషల్ మీడియా పోర్టల్ ఇన్ స్టాగ్రామ్ లో ఆమె రిలేషన్ షిప్ స్టేటస్ ను ‘ఎంగేజ్డ్’ అంటూ పెట్టింది. దాంతో అంతా కూడా నిధి అగర్వాల్ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా భావించారు.

ఉన్నట్లుండి తన రిలేషన్ షిప్ స్టేటస్ ను నిధి మార్చడంతో చాలా మంది ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ ప్రశ్నించారు. ఆమెకు మెసేజ్ లు.. కామెంట్స్ భారీగా రావడంతో నిధి స్పందించింది. నేనేం పెళ్లి చేసుకోబోవడం లేదని.. ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా సినిమాలపైనే ఉందని చెప్పింది. మరి రిలేషన్ షిప్ స్టేటస్ మార్చడంపై మాత్రం ఆమె స్పందించలేదు. ఈమె ఎవరితోనో ప్రేమలో ఉందని అందుకే ఎంగేజ్డ్ అంటూ స్టేటస్ పెట్టి ఉంటుందనిపిస్తుంది.

గతంలో ఈమె ఒక ప్రముఖ క్రికెటర్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఇద్దరు చెట్టా పట్టాలేసుకుని తిరగడం కూడా చేశారు. కాని కొంత కాలానికి వారిద్దరు బ్రేకప్ అయ్యారు. గత కొంత కాలంగా సింగిల్ గానే ఉన్న నిధి అగర్వాల్ మళ్లీ ఎవరినైనా జతగా ఎంచుకుందేమో. అందుకే ఆమె ఎంగేజ్డ్ అంటూ పెట్టిందేమో అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కెరీర్ లో నిలదొక్కుకుంటున్న నిధి అగర్వాల్ పెళ్లికి ఇంకా చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది.
Please Read Disclaimer