సైరా ఈవెంట్ లేనట్టేనా ?

0

రేపు సైరా నరసింహారెడ్డి టీజర్ 5 భాషల్లో విడుదల కానుంది. ఇప్పటిదాకా పోస్టర్లు మేకింగ్ వీడియోలతో సరిపుచ్చిన కొణిదెల సంస్థ ఇంకో రెండు రోజుల్లో చిరంజీవి బర్త్ డే వస్తున్న సందర్భంగా మెగా ఫ్యాన్స్ కు సూపర్ గిఫ్ట్ ని రెడీ చేసింది. ఇందులో చిరంజీవి కంప్లీట్ లుక్ కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో చిన్న సినిమా టీజర్ లాంచే పెద్ద గ్రాండ్ ఈవెంట్ గా చేస్తున్న ట్రెండ్ లో సైరాకు ఇంకే రేంజ్ లో చేస్తారో అనే అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి.

కానీ విశ్వసనీయ సమాచారం మేరకు రేపు టీజర్ లాంచ్ కు సంబంధించి ఎలాంటి ఈవెంట్ చేయడం లేదు. ఆ మేరకు అభిమాన సంఘాలకు మెసేజ్ కూడా వెళ్లిందట. ఎలాగూ 22న మెగా హీరోలతో కలిసి ఫ్యాన్స్ వేడుక చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇది అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమైన తరుణంలో ఈ ఐడియా డ్రాప్ అయినట్టుగా వినికిడి. సో సైరా టీజర్ నేరుగా ఆన్ లైన్ లో చూడటమే మనం చేయాల్సింది. అక్టోబర్ 2 రిలీజ్ డేట్ ని రేపే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

ఐదు భాషల్లో రిలీజ్ ప్లాన్ చేసిన సైరాకు ఇప్పటికే బిజినెస్ డీల్స్ పీక్స్ లో ఉన్నాయి. టీజర్ వచ్చాక ఇవి రెట్టింపు అవుతాయనే అంచనాలు ట్రేడ్ లో ఉన్నాయి. ఖైదీ నెంబర్ 150తో రెండేళ్ల గ్యాప్ తో చేస్తున్న మూవీ కాబట్టి సైరా మీద అన్ని రకాలుగా హైప్ మాములుగా లేదు. అందులోనూ బాహుబలిని దాటే సినిమాగా సైరాను చూస్తున్నవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సో రేపు టీజర్ రూపంలో సాంపుల్ గా వచ్చే వీడియోని బట్టి సైరా మీద మన ఎక్స్ పెక్టేషన్స్ ఏ రేంజ్ లో ఉండాలో క్లారిటీ వచ్చేస్తుందిPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home