మహేష్ కోసం పరశురామ్ కెరీర్ రిస్క్ లో పెట్టుకుంటున్నాడా…?

0

‘యువత’ సినిమాతో టాలీవుడ్ కి డైరెక్టర్ గా పరిచయమయ్యాడు పరశురామ్ (బుజ్జి). ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ తో ‘ఆంజనేయులు’ సినిమా తెరకెక్కించాడు. సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించక పోయినా డైరెక్టర్ గా పరశురామ్ కి ఇండస్ట్రీ లో ఒక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘సోలో’ ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలతో పర్వాలేదనిపించుకున్నాడు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ తో రూపొందించిన ‘గీత గోవిందం’ సినిమాతో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టిన మూవీగా నిలిచింది. అయితే భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాను పట్టాలెక్కించలేకపోయాడు పరశురామ్. కాకపోతే నాగ చైతన్య తో ఓ మూవీ స్టార్ట్ చేసారు కానీ ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు.’గీత గోవిందం’ సినిమాతో ఒక రేంజ్ కి వచ్చిన పరశురామ్ కి మహేష్ ఆఫర్ ఇచ్చి రేంజ్ మరింత పెంచేసాడు. మహేష్ బాబు కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి దాకా పరశురామ్ డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ సాఫ్ట్ గా ఒకే లెంగ్త్ లో కూల్ గా సాగిపోయే కథనంతో ఉంటాయి. అందులోనూ పెద్దగా మాస్ ఎలిమెంట్స్ జోలికి వెళ్ళడు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు పరశురామ్ కి ఎలా ఛాన్స్ ఇచ్చారు అని అందరూ అనుకున్నారు. అయితే పరశురామ్ పెట్లా ‘సర్కారు వారి పాట’ కోసం తన పంధా మార్చుకున్నారట. తాను డీల్ చేసిన సబ్జక్ట్స్ కి భిన్నంగా మహేష్ కోసం సందేశాత్మక అంశాలతో ఓ సీరియస్ సబ్జెక్టుతో రాబోతున్నాడు పరశురామ్.ఇప్పటికే ఎలివేషన్ సీన్స్ మరియు కమర్షియల్ గూస్ బమ్స్ సీన్స్ పవర్ ఫుల్ డైలాగ్స్ గురించి ఫ్యాన్స్ కంగారు పడవలసిన అవసరం లేదని.. నాకు అలాంటివి తీయడం రాక కాదు.. నా సినిమాల్లో వాటికి అవకాశం లేకపోవడం వల్లనే కుదరలేదని.. మహేష్ తో సినిమా అనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చాడు. అయితే మహేష్ బాబు కి హిట్ ఇవ్వడానికి పరశురామ్ తన కెరీర్ ని రిస్క్ లో పెడుతున్నాడు అనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇప్పటి వరకు కుటుంబ కథా చిత్రాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పరశురామ్ పెట్లా మహేష్ కి అలాంటి టైప్ కథలు సెట్ అవ్వవని భావించి తన పంధా మార్చుకుంటున్నాడు.

అయితే ఈ సినిమా ఫలితం ఆశాజనకంగా ఉంటే ఓకే. పరశురామ్ ఇలాంటి సబ్జక్ట్స్ కూడా డీల్ చేయగలడని నిరూపించుకుంటారు. ఒకవేళ రిజల్ట్ మాత్రం అనుకున్నట్లు రాకపోతే పరశురామ్ కెరీర్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని.. మొత్తం మీద మహేష్ కోసం పరశురామ్ రిస్క్ చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. కీర్తి సురేష్ ని హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి.
Please Read Disclaimer