పవన్ చెప్పింది చేయొచ్చుగా

0

పవన్ కళ్యాణ్ జనసేన మొదలుపెట్టాక సినిమాలను వదిలేయడం అభిమానులకు పూర్తిగా ఇష్టం లేకపోయినా ఏదోనాడు మళ్ళీ చేయకపోతాడా అనే నమ్మకమైతే అధిక శాతం ఉండటం అబద్దం కాదు. ఒకవేళ నిజమైతే క్రేజ్ విషయంలో ఇప్పటికీ మోనార్క్ గా నిలిచే పవన్ దర్శకుడితో సంబంధం లేకుండా వంద కోట్ల బిజినెస్ ఒక్క సినిమాతో చేయించగలడు. అదలా ఉంచితే అప్పుడప్పుడూ సినిమా రిలేటెడ్ ఈవెంట్స్ కు అటెండ్ అవుతున్న పవన్ నిన్నో పుస్తక ఆవిష్కరణకు వెళ్ళాడు. చాలా సంగతులే చెప్పాడు.

ప్రపంచాన్ని శాశించే స్థాయి సినిమాకు ఉందని బాహుబలి లాంటివి మరెన్నో తీసే గొప్ప సాహిత్యం తెలుగునాట అందుబాటులో ఉందని చాలా విశేషాలే చెప్పాడు. సమాజాన్ని ప్రభావితం చేసే బలం సినిమాకు ఉందని పవన్ ఉద్దేశం. ఒకవేళ అదే నిజమైనప్పుడు ప్రజల్ని ఇంకా చైతన్యవంతులుగా మార్చేందుకు జనసేన భావజాలాన్ని ఇంకా బలంగా తీసుకెళ్లేందుకు పవన్ సినిమాల్లో నటిస్తే బాగుంటుంది కదా అనేది సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్. ఎలాగూ వచ్చే ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది.

ఇప్పటికిప్పుడు ఏ ప్రతిపక్షమూ ఏమి చేయలేని పరిస్థితి. ఒక్క సీటుతో జనసేన అద్భుతాలు చేసే ఛాన్స్ లేదు. అలాంటాప్పుడు ప్రభావితం చేయగలిగే రేంజ్ ఉన్న పవన్ సినిమాలు చేయడం కరెక్టే కదా. కానీ దీనికి సమాధానం చెప్పాల్సింది కూడా పవనే. ఇప్పటికీ మైత్రి లాంటి సంస్థలు ఇచ్చిన అడ్వాన్సులు పవన్ వద్దే ఉన్నాయని టాక్ ఉంది. వెనక్కు తీసుకోమన్నా వాళ్ళు వినడం లేదని గతంలోనే న్యూస్ వచ్చాయి. నేను చేయను అని పవన్ ఖరాఖండిగా చెబుతున్నాడు కానీ నిర్ణయాన్ని ఓసారి పునఃసమీక్షించుకుంటే బెటరేమో.
Please Read Disclaimer