సైరా వెనుక పవన్ స్వరం : పిక్ టాక్

0

మొన్న మేకింగ్ వీడియోతో సంచలనం రేపిన సైరా ఇంకో నాలుగు రోజుల్లో టీజర్ తో సందడి చేయనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలుత మేకింగ్ కే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడని లీక్ వచ్చింది కానీ అది వాస్తవానికి టీజర్ కోసం. దీనికి సంబంధించిన క్లారిటీ ఫోటో రూపంలో వచ్చేసింది. పవన్ డబ్బింగ్ చెబుతుండగా పక్కనే దర్శకుడు సురేందర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పర్యవేక్షిస్తున్న పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

టీజర్ ఎంత సేపు ఉంది వీడియో మొత్తం పవన్ వాయిస్ ఉంటుందా లేక కొన్ని సెకండ్లు మాత్రమేనా అనే క్లారిటీ లేదు. చిరంజీవి సినిమాకు సంబంధించి పవన్ ఇలా గొంతు ఆరువివ్వడం ఇదే మొదటిసారి. ఇద్దరు కలిసి శంకర్ దాదా జిందాబాద్ లో కలిసి నటించారు కానీ ఇన్నాళ్లకు ఈ రూపంలో ఈ కలయిక మళ్ళి ఇలా సాధ్యపడింది. సైరా టీజర్ గురించి మెగా ఫాన్స్ చాలా అంచనాలతో ఎదురు చూస్తున్నారు.

మేకింగ్ వీడియో బాగున్నప్పటికీ చిరు లుక్ సరిగా రివీల్ చేయలేదనే అసంతృప్తి వాళ్లలో ఉంది. దానికి పూర్తిగా చెక్ పెట్టేలా టీజర్ ఎడిటింగ్ లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. కీలకమైన ఒక డైలాగ్ కూడా రివీల్ చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే దాని తాలూకు వర్క్స్ లో కొణిదెల టీమ్ బిజీగా ఉంది. పుట్టినరోజుకు రెండు రోజులు ముందే సైరా టీజర్ ఆన్ లైన్ లోకి వస్తోంది కాబట్టి మెగా ఫ్యాన్స్ లో రెట్టింపు సంబరం ఉంటుంది. ఇప్పుడీ పవన్ వాయిస్ కూడా తోడయ్యింది కాబట్టి అంతకంటే వాళ్ళకైనా కావాల్సింది ఏముంది.
Please Read Disclaimer