ప్రభాస్ 21 రాజు గారి బ్యానర్లోనే ?

0

ప్రస్తుతం జాన్(వర్కింగ్ టైటిల్) తో సెట్స్ మీదున్న ప్రభాస్ ఈ సినిమాకు సంబంధించి ఆల్మోస్ట్ ఫీనిషింగ్ స్టేజికి తీసుకొచ్చేశాడు. పీరియాడిక్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో సీజీ వర్క్స్ కి స్కోప్ లేదు. అందుకే యూనిట్ ఇప్పటికే డెబ్భై శాతం షూటింగ్ పూర్తి చేసేసారని తెలుస్తోంది.

ఈ సినిమా గురించి పక్కన పెడితే ప్రభాస్ 21 వ సినిమాను ఎవరితో చేస్తాడా అనే చర్చ గట్టిగా నడుస్తుంది. రెబల్ స్టార్ లిస్ట్ లో సురేందర్ రెడ్డితో పాటు కొరటాల కూడా ఉన్నాడు. కాకపోతే కొరటాల శివతో సినిమాకు ఇంకాస్త టైం పడుతుంది. ఇక సురేందర్ రెడ్డితోనే నెక్స్ట్ సినిమా ఉండొచ్చని అంటున్నారు. లేటెస్ట్ గా ‘సైరా’తో పాన్ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి ప్రభాస్ కోసం ఓ మాస్ కమర్షియల్ కథను సిద్ధం చేశాడని టాక్.

ఇప్పటికే ప్రభాస్ ను కలిసి సూరి స్క్రిప్ట్ వినిపించడాని ప్రభాస్ కి స్టోరీ నచ్చిందని సమాచారం. ఇక ఈ కాంబో సినిమాను దిల్ రాజు నిర్మించే ఛాన్స్ ఉందనే టాక్ కూడా వినిపిస్తుంది. మిస్టర్ పర్ఫెక్ట్ నుండి ప్రభాస్ ఇంకో సినిమా నిర్మించాలని చూస్తున్న రాజు ఎట్టకేలకు ప్రభాస్ సినిమాను ఫైనల్ చేసేసాడని తెలుస్తుంది.
Please Read Disclaimer