చిరు చరణ్ కాంబో మరోసారి ?

0

సైరా ఇంకా ప్రమోషన్ మొదలుపెట్టనే లేదు అప్పుడే చిరు 152కి సంబంధించిన విశేషాలు ఫిలిం నగర్ లో రచ్చ చేస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహించే ఈ మూవీని ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మొదలుపెడతారని ఇప్పటికే టాక్ ఉంది. ఇదిలా ఉండగా మరో సర్ప్రైజ్ న్యూస్ మెగా ఫాన్స్ కి కిక్ ఇచ్చేలా ఉంది. దాని ప్రకారం ఇందులో రామ్ చరణ్ కూడా ఓ క్యామియో లాంటి కీలక పాత్ర ఒకటి చేస్తాడట. సినిమా మొత్తం ఉండడు కానీ కీలకమైన సన్నివేశాల్లో ఎంట్రీ ఇస్తూ గూస్ బంప్స్ ఇచ్చే తరహాలో ఆ కాంబో సీన్స్ ని శివ రాసుకున్నట్టు తెలిసింది.

ఇది తనని దృష్టిలో పెట్టుకునే రాశారట. కానీ ఇది అఫీషియల్ గా ధృవీకరించే ఛాన్స్ ఇప్పట్లో లేదు. ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇంకా జరగలేదు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుని ప్రస్తుతం హీరోయిన్ వేటలో ఉన్న కొరటాల శివ అది పూర్తి కాగానే మిగిలిన టీమ్ ఇతర తారాగణాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. చిరు చరణ్ లు గతంలో కలిసి నటించారు కానీ అది చాలా పరిమితమైన టైం. మగధీర మొదటి పాట చివర్లో బ్రూస్ లీ ప్రీ క్లైమాక్స్ ఫైట్లో ఖైదీ నెంబర్ 150లో సాంగ్ బిట్ లో ఇలా మూడు సార్లు అభిమానులను అలరించారు.

అయితే ఇంతకు మించి ఈ ఇద్దరి కాంబో నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్నారు. అది చిరు 152 పూర్తిగా నెరవేరుస్తుందని వాళ్ళ నమ్మకం. ఈ సినిమా కోసమే చిరు ప్రత్యేకంగా తన లుక్స్ ని మార్చుకునే పనిలో ఉన్నారు. అప్పుడే చేంజ్ కనిపిస్తోంది కూడా. ఇంకొంత బెటర్ మెంట్ కోసం ఆయుర్వేద చికిత్స తీసుకోవడానికి కేరళ వెళ్ళబోతున్నట్టు టాక్ ఉంది. మొత్తానికి సైరా తర్వాత రిలాక్స్ అవ్వకుండా చిరు పెద్ద ప్లాన్స్ లోనే ఉన్నారు.
Please Read Disclaimer