రవితేజ కారణంగా రాములమ్మ రీఎంట్రీ వాయిదా పడిందా?

0

చాలా ఏళ్ల తర్వాత మరోసారి స్క్రీన్ మీద రాములమ్మ తన సత్తా చాటనున్నారు. తాజాగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు టీజర్ లో కనిపించింది రెండు ఫ్రేముల్లోనే అయినా.. విజయశాంతి ఛార్మ్ ఏ మాత్రం తగ్గలేదన్నట్లుగా ఉందన్న టాక్ వినిపించింది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ పై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి ముందే రాములమ్మతో చాలామంది చాలా ప్రాజెక్టులు అనుకున్నా వర్క్ వుట్ కాలేదట. ఎక్కడిదాకానో ఎందుకు అనిల్ రావిపూడి సైతం విజయశాంతిని గతంలోనే రీఎంట్రీ కోసం ట్రై చేశారట. చిన్నతనం నుంచి రాములమ్మ డైనమిజమ్ కు వీరాభిమాని అట. ఆమెతో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాడట.

కానీ.. ఏదో ఒకటి అడ్డుపడేదట. వాస్తవానికి విజయశాంతి కోసం ఒక పాత్రను సిద్ధం చేసుకున్నాడట. తాను తీసిన రాజా ది గ్రేట్ సినిమాను తొలుత రామ్ తో అనుకున్నారట. ఆ చిత్రంలో రామ్ తల్లి పాత్రలో విజయశాంతిని అనుకున్నారట. అయితే.. ఆ ప్రాజెక్టు రవితేజ ఓకే చేయటంతో విజయశాంతి రీఎంట్రీ ఆగినట్లు చెప్పారు
.
తనకు తగ్గ పాత్ర ఉంటే కచ్ఛితంగా చేస్తానని తనతో విజయశాంతి చెప్పారని.. రాజా దిగ్రేట్ లో కాదనుకొని తాజా చిత్రంలో భారతి పాత్ర రాసుకున్న తర్వాత.. దానికి రాములమ్మ తప్పించి మరెవరినీ తాను ఊహించలేదని అనిల్ చెబుతున్నాడు. మొత్తానికి రాములమ్మ రీఎంట్రీ ఆలస్యానికి రవితేజ కూడా ఒక కారణమన్నమాట.
Please Read Disclaimer