బాహుబలి కోసం భల్లాలదేవుడు 2 నిమిషాలు ఇవ్వనున్నాడా?

0

ప్రభాస్ 20వ చిత్రం షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జార్జియాలో షూటింగ్ జరుపుతుండగా మహమ్మారి వైరస్ కారణంగా షూటింగ్ అర్థాంతరంగా నిలిపేసి ఇండియాకు వచ్చేశారు. మళ్లీ షూటింగ్ కు విదేశాలకు వెళ్లే పరిస్థితి లేదు. దాంతో రామోజీ ఫిల్మ్ సిటీలోనే భారీ సెట్టింగ్స్ వేసి సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జులై లేదా ఆగస్టు నుండి సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉందట. ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. అది సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

బాహుబలి సినిమాలో ప్రభాస్ తో భల్లాలదేవుడిగా ఢీ కొట్టిన రానా ఈ చిత్రంలో కూడా నటించబోతున్నాడట. రాధేశ్యామ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్న ఈ చిత్రంలో రెండు లేదా మూడు నిమిషాల పాటు రానా కనిపిస్తాడనే టాక్ వినిపిస్తుంది. ఈ విషయమై యూనిట్ సభ్యుల నుండి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఈ విషయాన్ని సస్పెన్స్ గా ఉంచాలని సినిమా విడుదల వరకు రివీల్ చేయకూడదని భావిస్తున్నారు.

ఈ చిత్రంలో రానా ఎలా అగుపిస్తాడు ఏ సందర్బంలో కనిపిస్తాడనేది చూడాలి. ప్రభాస్ తో స్నేహం మరియు అభిమానం కారణంగా ఈ చిత్రంలో కొద్ది సమయం కనిపించేందుకు రానా ఒప్పుకుని ఉంటాడు. వీరిద్దరు మంచి స్నేహితులు అనే విషయం అందరికి తెలిసిందే. అందుకే స్నేహం కోసం రానా రాధేశ్యామ్ సినిమా కోసం రెండు నిమిషాలు ఇస్తాడు లేదా ఇవ్వనున్నాడు అనడంలో అతిశయోక్తి ఏమీ అనిపించడం లేదని నెటిజన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer