బ్యాచిలర్ సెకండాఫ్ సీన్స్ రీ షూట్ చేస్తున్నారా…?

0

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాస్ – వాసు వర్మ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో అఖిల్ కి జోడీగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ ఆకట్టుకున్నాయి. అలానే గోపీ సుందర్ స్వరపరిచిన ‘మనసా మనసా’ లిరికల్ సాంగ్ విశేష ఆదరణ దక్కించుకుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది.

ఈ షెడ్యూల్ లో సెకండాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సెకండాఫ్ లో కొన్ని సీన్స్ డౌట్ గా ఉండటంతో మళ్ళీ రీ షూట్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా ఈ చిత్రంపై అక్కినేని ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా ఆశలు పెట్టుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి సాలిడ్ హిట్ కోసం కష్టపడుతున్న అఖిల్ కి ఈ సినిమా మంచి విజయాన్ని అందిస్తుందని నమ్మకంగా ఉన్నారు. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.