‘వకీల్ సాబ్’ లో రేణుదేశాయ్?

0

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం గా ‘పింక్’ రీమేక్ రూపొందుతున్న విషయం తెల్సిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి భారీ హైప్ క్రియేట్ చేసేందుకు దిల్ రాజు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా ఒక కీలక పాత్రలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ ను నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. పవన్ నుండి విడిపోయిన తర్వాత పూణె లో ఉంటున్న రేణు దేశాయ్ సోషల్ మీడియా లో ప్రేక్షకులకు దగ్గర గానే ఉంటూ వస్తున్నారు.

రేణు దేశాయ్ గతంలో హీరోయిన్ గా నటించారు. కనుక ఇప్పుడు ఆమె రీ ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది ఆశిస్తున్నారు. కనుక దిల్ రాజు ఈ కాంబోను సెట్ చేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాని ఈ వార్తలను కొందరు కొట్టి పారేస్తున్నారు. పవన్ కళ్యాణ్.. రేణు దేశాయ్ లను మళ్లీ ఒకే స్క్రీన్ పై చూడటం సాధ్యం కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దిల్ రాజు తల్చుకుంటే ఏదైనా సాధ్యం చేయగలడు. అందుకే ఆయన ఏదో ఒక విధంగా రేణు దేశాయ్ ను ఒప్పించే అవకాశాలు లేకపోలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఒక వేళ పింక్ రీమేక్ లో కనుక రేణు దేశాయ్ నటిస్తే తప్పకుండా అదో సంచలనంగా చెప్పుకోవచ్చు. మరి ఈ సంచలనం నమోదు అవుతుందా అనేది చూడాలి.
Please Read Disclaimer