సాహోకి నిజంగా అంత సీనుందా ?

0

ఇంకో 48 గంటల్లో సాహో ఫలితం వచ్చేస్తుంది. అభిమానులే కాదు బయ్యర్లు సైతం గుండెల్లో డైనమైట్లు పెట్టుకుని మరీ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అంతటా ఇది బాహుబలి 2ని దాటుతుందా లేదా అనే దాని మీదే దృష్టి పెడుతున్నారు కానీ నిజంగా ఆ స్థాయి బజ్ సాహోకు ఉందా లేదా అని ఆలోచించడం లేదు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే సౌత్ లో ఇప్పటిదాకా విపరీతమైన బజ్ తో జనంలో ఓ రేంజ్ యాంగ్జైటిని మైంటైన్ చేసి భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్న సినిమాలు రెండే.

బాహుబలి ఒకటి కాగా రెండోది రోబో. 2 పాయింట్ 0 సైతం అంత అటెన్షన్ తీసుకురాలేదు. అందుకే కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలవాల్సి వచ్చింది. కానీ సాహోకు బుకింగ్స్ పరంగా ట్రెండ్ బాగానే ఉంది కానీ హైప్ పరంగా చూస్తే బాహుబలి రోబో స్థాయిలో లేదన్నది వాస్తవం. దీన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఉత్సుకత యువతలో ఫాన్స్ లో ఉంది కానీ మాస్ మరియు ఫామిలీ వర్గాల నుంచి అంత స్పందన లేదు ట్రైలర్ బాగానే రెస్పాన్స్ తెచ్చుకున్నా ఆడియో మాత్రం సంతృప్తపరచలేకపోయిన సాహో ఆ మైనస్ ని కవర్ చేయడానికి ఏకంగా వీడియో సాంగ్స్ ని రిలీజ్ చేయడం గమనించాల్సిన అంశం.

ఇది బాలీవుడ్ స్ట్రాటజీ అయినప్పటికీ తెలుగులో ఇలా చేయడం అరుదు. ఇప్పుడు సాహో మొదటి రోజు ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుంది అనేది కాసేపు పక్కన పెడితే రిలీజ్ రోజు వచ్చే పబ్లిక్ టాక్ మీడియాలో వచ్చే రివ్యూలు ఇవన్నీ బాహుబలి రోబోల తరహాలో అవుట్ అండ్ అవుట్ ఎక్స్ ట్రాడినరి అని వస్తే తప్ప ఒకే మొమెంటం కొనసాగదు. ఈ రిస్క్ సాహోకి ఖచ్చితంగా అది. మరి హైప్ విషయంలో వాటి కన్నా వెనుకబడ్డ సాహో ఏ రకంగా అంచనాలు నిలబెట్టుకుంటుందో వేచి చూడాలి.
Please Read Disclaimer