ఇంట్రో కూడా కాపీ కొట్టాలా సాహో

0

డార్లింగ్ ప్రభాస్ రెండేళ్ళ గ్యాప్ తో వచ్చిన సాహో ఇవాళ గ్రాండ్ ఓపెనింగ్స్ తో వచ్చేసింది. థియేటర్లు అభిమానులు ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. టాక్ సంగతి పక్కన పెడితే సోషల్ మీడియా మాత్రం దీని తాలుకు నెగటివ్ పోస్టులతో ఊగిపోతోంది. సుజిత్ అంచనాలు అందుకోవడం విఫలమయ్యాడని ఓ రేంజ్ లో కామెంట్స్ పెడుతున్నారు. వీటి సంగతి పక్కన పెడితే ముందు నుంచి ఇదొక ఎక్స్ ట్రాడినరి యాక్షన్ ఎంటర్ టైనర్ అనే ట్యాగ్ తగిలించారు కాబట్టి ప్రతి విషయంలోనూ అంచనాలు పీక్స్ కు వెళ్ళిపోయాయి.

ఇంత పెద్ద గ్రాండియర్ లో హీరో ఎంట్రీ ఎలా ఉంటుందో అని ఏవేవో ఊహించుకున్నారు. కాని చాలా సిల్లీగా ఓ రౌడీకి కొందరు కాలనీలో ఉరి వేస్తుంటే వర్షంలో తడుస్తూ వచ్చి ప్రభాస్ అతన్ని కాపాడటం డిజైన్ చేశాడు సుజిత్. పోనీ ఇదైనా మైండ్ బ్లోయింగ్ గా ఉందా అంటే అంతా హడావిడిగా సాగిపోతుంది. సరే ఇంతా చేసి ఇదంతా కొత్తగా ఏమైనా ఉందా అని చూస్తే ఇదే స్టైల్ ఫైట్ ఎపిసోడ్ చిరంజీవి ఎప్పుడో చేశాడు.

గుణ శేఖర్ దర్శకత్వంలో వచ్చిన చూడాలని ఉందిలో ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫస్ట్ ఫైట్ లో అచ్చం ఇలాంటి ఎపిసోడే ఉంటుంది. కాకపోతే అందులో కొంచెం కామెడీ టచ్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో మిక్స్ చేయడానికి ట్రై చేసినా వర్క్ అవుట్ కాలేదు. ఇది పక్కన పెడితే రెండు ఒకేలా అనిపిస్తాయి. అది కూడా ఏ హాలీవుడ్ సినిమా నుంచో స్ఫూర్తి తీసుకుని ఉండొచ్చు కాని అది వచ్చి చాలా ఏళ్ళు అయ్యింది. కాని ఇప్పటికీ సుజిత్ అదే తరహా మేకింగ్ లో ప్రభాస్ ఎంట్రీని ప్లాన్ చేయడమే అసలు విచిత్రం.
Please Read Disclaimer