ఐతే సంక్రాంతి కాకపోతే క్రిస్మస్..!

0

కామెడీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రెస్ అయిన మారుతి ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘ప్రతి రోజూ పండగే’ అనేది వర్కింగ్ టైటిల్. ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోందని.. ఇప్పటి నుంచే సినిమా రిలీజ్ గురించి తీవ్రంగా చర్చిస్తున్నారని సమాచారం.

థీమ్ ను బట్టి ఈ సినిమాను ఒక పండగ సీజన్ లో విడుదల చేస్తే బాగుంటుందనే అభిప్రాయంలో మేకర్స్ ఉన్నారట. ముఖ్యంగా వారి దృష్టంతా సంక్రాంతి పండగ మీదే ఉందట. కానీ ఇప్పటికే సంక్రాంతి రిజర్వేషన్లు అయిపోయి వెయిట్ లిస్టు కూడా చేంతాడంత ఉంది. ఒకవేళ కుదిరితే మాత్రం ఫస్ట్ ఛాయిస్ సంక్రాంతి అని.. అలా కాని పక్షంలో ప్రత్యామ్నాయంగా మరో పండగ సీజన్ చూసుకోవాలనే ప్లాన్ చేస్తున్నారట. దీంతో క్రిస్మస్ సీజన్ అయితే బెటర్ అనే ఆలోచనకు వచ్చారట. కానీ క్రిస్మస్ కూడా ఈమధ్య టాలీవుడ్ సినిమాలకు మెయిన్ సీజన్ గా మారింది. మరి మిగతా ఫిలిం మేకర్లు క్రిస్మస్ డేట్ ను ప్రకటించేకంటే ముందే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తే మంచిదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

ఈ సినిమాలో తేజు సరసన బ్యూటిఫుల్ రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. జీఎ2 పిక్చర్స్.. యూవీ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమాతో సుప్రీం హీరోకు మారుతి ఒక సాలిడ్ హిట్ ఇస్తాడా లేదా అనేది వేచి చూడాలి.
Please Read Disclaimer