శర్వా సర్జరీతో లేనిపోని కన్ఫ్యూజన్

0

ఒక చిన్న డిస్ట్రబెన్స్ రకరకాల సందిగ్ధతలకు తావిచ్చింది. యంగ్ హీరో శర్వానంద్ 96 సెట్స్ లో గాయపడిన సంగతి తెలిసిందే. అతడి భుజానికి హైదరాబాద్ సన్ షైన్ ఆస్పత్రిలో విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. అయితే కొన్ని రోజుల పాటు శర్వానంద్ ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించడంతో అది కొన్ని రకాల కన్ఫ్యూజన్ లకు కారణమైంది. ఒకటి రిలీజ్ కి రెడీ అయిన సినిమా విషయంలో … ఇంకొకటి సెట్స్ పై ఉన్న సినిమా విషయంలో కన్ఫ్యూజన్ తప్పడం లేదు.

ఒకటి శర్వా హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న 96 రీమేక్ షూటింగ్ కొన్నాళ్ల పాటు వాయిదా పడినట్టేనా? రెండోది ఇప్పటికే ఆగస్టులో రిలీజ్ చేస్తామని ప్రకటించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ `రణరంగం` చెప్పిన టైముకే వస్తుందా? అంటూ సందేహం వ్యక్తమైంది. అయితే శర్వా వచ్చే వరకూ 96 షూటింగ్ చేయడం కష్టం. శర్వానంద్ లేని సన్నివేశాలతో పాటు ఇతరత్రా వ్యవహారాల్ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అయితే రణరంగం చిత్రీకరణ ఇప్పటికే పూర్తయి నిర్మాణానంతర పనులు పూర్తి చేస్తున్నారు కాబట్టి ఆ సినిమా రిలీజ్ ని ఎట్టి పరిస్థితిలో ఆపకూడదని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ భావిస్తోందట.

అయితే శర్వాకి ఆరోగ్యం సహకరించాల్సి ఉంటుంది. అతడు వచ్చి డబ్బింగ్ పనులు పూర్తి చేస్తే ఏ ఇబ్బంది లేకుండా చెప్పిన టైముకే (ఆగస్టు 2) రిలీజవుతుంది. అలా రిలీజ్ చేయాలనే సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ పక్కాగా ప్లాన్ చేస్తోందట. అయితే శర్వా వచ్చి డబ్బింగ్ చెబుతాడా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. 96 షూటింగ్ కోసం వెళ్లి స్కై డైవింగ్ చేస్తూ శర్వా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇలాంటి కన్ఫ్యూజన్లు నెలకొన్నాయి. రణరంగం చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేయాలని.. అలాగే దసరా బరిలో 96 రీమేక్ ని రిలీజ్ కి తేవాలని శర్వానంద్ కూడా భావిస్తున్నారు. అయితే సుదీర్ఘ కాలం బెడ్ రెస్ట్ అన్నదే ఇబ్బందికరం అని భావిస్తున్నారు. అయితే ఈ సందేహాలన్నిటికీ శర్వా కానీ మేకర్స్ కానీ తెర దించుతారేమో చూడాలి.
Please Read Disclaimer