అప్పుడు మిస్.. ఇప్పుడు ఆఫర్ దక్కుతుందా?

0

ఒక క్రేజీ యువ హీరోకు సూపర్ డూపర్ హిట్ అందించిన దర్శకుడు ఆయన. ఆ సినిమా విడుదలై చాలాకాలం అయినా ఇప్పటివరకూ ఎక్కే గడప దిగే గడప అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. నెక్స్ట్ సినిమా మాత్రం ఫైనలైజ్ కాలేదు. స్టార్ హీరోల కోసం ప్రయత్నాలు చేసి విసిగిపోయిన ఆయన ఈ యువహీరోతోనే సినిమా చేసేందుకు నిర్ణయించుకున్నాడు.

ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. హీరో బిజీగా ఉన్నాడు కాబట్టి వెంటనే పట్టాలెక్కే అవకాశం లేదు కానీ సినిమా మాత్రం దాదాపు పక్కా అయిందట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక బ్యూటిఫుల్ డెవిల్ ని సూచించారట ఆ దర్శకుడు. ఈ హీరోయిన్ తన కెరీర్ మొదట్లో మంచి హిట్లతో దూసుకుపోయింది కానీ ప్రస్తుతం కెరీర్ నత్తనడకన సాగుతోంది. అందుకే ఈ హీరోయిన్ కు ఈ సినిమాలో అవకాశం ఇవ్వాలని దర్శకుడు ప్రయత్నిస్తున్నాడట.

నిజానికి ఈ దర్శకుడు ఆ యువహీరోతో చేసిన సూపర్ హిట్ సినిమాలోనే ఈ హీరోయిన్ కు అవకాశం ఇచ్చాడట. కానీ అప్పట్లో అనుకోని కారణాల వల్ల మరో హీరోయిన్ కు ఆ ఆఫర్ దక్కింది. ఆ సినిమా హిట్ కావడంతో అందులో నటించిన హీరోయిన్ కాస్తా స్టార్ గా మారింది. అప్పుడు అవకాశం మిస్ చేసుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు దక్కించుకుంటుందా.. ఈ సినిమా హిట్ అవుతుందా అనేది వేచి చూడాలి.
Please Read Disclaimer